గ్రహ
వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి తక్కువగా ఉంటే అక్కడ నీటితో పాటు జీవం ఉండే
అవకాశం ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. కార్బన్ డై ఆక్సైడ్ తక్కువగా ఉంటేనే
గ్రహాలు జీవ నివాసయోగ్యంగా ఉంటాయనేది పరిశోధనల సారాంశం. గ్రహాల వాతావరణాలు పోల్చి
చూడగా ఈ విషయం వెల్లడైనట్లు పరిశోధనాపత్రాన్ని సమర్పించారు.
సముద్రాలు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ను
పీల్చుకోవడంతో దాని ప్రభావం తగ్గుతుందని పరిశోధకలు చెబుతున్నారు. నీటి వల్లే జీవం
పుట్టుకొచ్చిందని, కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని చెట్లు వదిలే ఆక్సిజన్ జీవులకు
ప్రాణాధారమైందని అమెరికాలోని ఎంఐటీ, బ్రిటన్ లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం
పరిశోధకులు తెలిపారు.
నక్షత్రాల
చుట్టూ ఏర్పడే గ్రహాలు నివాసయోగ్యమా కాదా అని తెలుసుకునేందుకు ఎన్నో పరిశోధనలు జరిగాయని
అయితే అక్కడ పూర్తిస్థాయి నీటి జాడ గురించి తెలుసుకునే శాస్త్రీయ పద్ధతి ఇప్పటి వరకు లేదన్నారు. తాము కనుగొన్నఅంశాల ద్వారా శాస్త్రీయ నమూనా
అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ మేరకు నేచర్ ఆస్ట్రోనమీ జర్నల్ లో వెల్లడించారు.
నక్షత్రాలకు
దగ్గరగా ఉండే గ్రహాలు అత్యంత వేడి వాతావరణాన్ని కలిగి ఉంటే దూరంగా ఉండే గ్రహాలు
అత్యంత శీతలంగా ఉంటాయి. ఇవి జీవ నివాసయోగ్యానికి పనికిరావు. నీరు ఉన్న గ్రహాలపైనే
జీవులు మనుగడ సాధించగల్గుతాయి.
శుక్ర
గ్రహ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. భూమిపై కూడా వేల సంవత్సారాల
క్రితం అలానే ఉండేదని అయితే సరైన
ఉష్ణోగ్రతల కారణంగా సముద్రాలు ఏర్పడి కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకున్నాయని తాజా
పరిశోధన చెబుతోంది. నీటి వల్లే భూమి పై జీవం పుట్టుకొచ్చిందనేది తాజా పరిశోధన
సారాంశం.