Ayodhya airport built
in just 20 months
శ్రీరామచంద్రమూర్తి మందిర ప్రాణప్రతిష్ఠా
కార్యక్రమం దగ్గర పడుతుండడంతో అయోధ్యకు (Ayodhya) రాజయోగం పట్టింది. భగవానుడి
జన్మభూమికి వెళ్ళడానికి హిందూ బంధువులందరూ తహతహలాడుతున్నారు. దాంతో కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు అక్కడకు మెరుగైన రవాణా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆ క్రమంలో భాగంగానే
అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం (International
Airport) నిర్మించారు.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airport Authority of India) చైర్మన్ సంజీవ్ కుమార్ (Chairman
Sanjeev Kumar) కొత్తగా నిర్మించిన విమానాశ్రయం గురించి వివరిస్తూ
దాన్ని కేవలం 20 నెలల వ్యవధిలోనే పూర్తి చేసామని చెప్పారు. అయోధ్యలో విమానాశ్రయ
నిర్మాణం, అభివృద్ధి కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2022 ఏప్రిల్లో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎయిర్పోర్ట్
కోసం రాష్ట్ర ప్రభుత్వం 821 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
‘‘అయోధ్యలో విమానాశ్రయాన్ని ఏఏఐ కేవలం 20
నెలల రికార్డు వ్యవధిలో నిర్మించింది. ఈ నగరానికి ఎయిర్ కనెక్టివిటీ ఎంతో ముఖ్యం.
పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దాంతోపాటే కనెక్టివిటీ కూడా
మెరుగుపడుతుంది. ఈ విస్తరణ మా సంస్థకు సంతోషకరం. కొత్త విమానాశ్రయాన్ని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ ప్రారంభిస్తారు’’ అని సంజీవ్ కుమార్ చెప్పారు.
విమానాశ్రయ విస్తరణతో అయోధ్యకు పర్యాటకుల
తాకిడి పెరుగుతుంది. వారు కేవలం అయోధ్యలోని శ్రీరామజన్మభూమి మందిరమే కాకుండా రామ్
కీ పైదీ, హనుమాన్ గఢీ, నాగేశ్వరనాథ మందిరం, బిర్లా టెంపుల్ వంటి సమీపంలోని ఆలయాలను
కూడా సందర్శిస్తారు.
అయోధ్యలో విమానాశ్రయ నిర్మాణం వల్ల
వాణిజ్య వ్యాపార కార్యక్రమాలు కూడా ఊపందుకుంటాయి. పుణ్యక్షేత్ర పర్యాటకం సంవత్సరం
పొడవునా కొనసాగుతుంది. దానివల్ల ఆ ప్రాంతంలో సమగ్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది.
ప్రధాని మోదీ ఇవాళ ఈ విమానాశ్రయాన్ని
ప్రారంభిస్తారు, దీనికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యాధామ్’
అని నామకరణం చేస్తారు.