A historic day for Assam , ULFA signs peace agreement
హింసను
వీడటంతో పాటు జనజీవన స్రవంతిలో కలిసిపోతామని వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్
ఫ్రంట్ ఆఫ్ అసోం(ULFA) ప్రకటించింది. ఈ మేరకు అసోం
ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఉల్ఫా వేర్పాటువాదుల మధ్య ఒప్పందం జరిగింది. హింసకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య
ప్రక్రియలో భాగస్వాములుగా ఉంటామని ప్రకటించారు. తమ శిబిరాలు ఖాళీ చేస్తామని
ఉల్ఫా సభ్యులు తెలిపారు. ఇక నుంచి ఏ రకమైన హింసా కార్యక్రమాల్లో తాము భాగం
కాదుల్చుకోలేదని తేల్చి చెప్పారు.
కేంద్ర
హోంమంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సమక్షంలో ఒప్పందపత్రాలపై ఉల్ఫా
వేర్పాటువాద సంస్థకు చెందిన అరబిందా రాజ్ఖోవా వర్గం సంతకాలు చేసిందిు. 12 ఏళ్ళగా ఈ వర్గం, కేంద్రంతో శాంతి చర్చలు
జరపగా ఇప్పటికీ కార్యరూపం దాల్చింది.
‘‘ ఉల్ఫా
వేర్పాటు వాద సంస్థ, హింసను వీడి శాంతిమార్గాన్ని ఎంచుకోవడం అసోంకు ఎంతో మేలు చేస్తోందని’’
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
అసోం కు ఇదో గొప్ప రోజుగా చరిత్రలో
నిలుస్తుందని ఆకాంక్షించిన అమిత్ షా, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉల్ఫా భాగం కావడం
అభినందనీయమన్నారు. అసోం అభివృద్ధికి కేంద్రం మరింత అంకితభావంతో పనిచేస్తుందన్నారు.
ప్రత్యేక కమిటీ నియమించి నిర్ణీత వ్యవధిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు
చేస్తామన్నారు.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి
నుంచి ఈశాన్య రాష్ట్రాలు, దిల్లీ మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడిందన్నారు. అందుకు
ఈ శాంతి ఒప్పందం కూడా ఓ తార్కాణంగా నిలుస్తోందన్నారు.
శాంతి
ఒప్పందం చరిత్రాత్మకమని అభివర్ణించిన అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ, ప్రధాని మోదీ,
హోంమంత్రి అమిత్ షా చొరవతోనే ఈ ముందడుగు సాధ్యమైందన్నారు.
ఉల్ఫాలోని
పరేశ్ బారువా నేతృత్వంలోని మరో వర్గం ఈ శాంతి ఒప్పందానికి దూరంగా ఉంది. పరేశ్, ప్రస్తుతం
చైనా-మయన్మార్ సరిహద్దులో అతడు తలదాచుకున్నన్నట్లు వార్తలు వెలువడ్డాయి.
అస్సామీ
సార్వభౌమత్వం పేరిట 1979లో పురుడు పోసుకున్న ఈ సంస్థ, అస్సామీ ప్రజలకు ప్రత్యేక దేశం ఏర్పాటు
చేయాలని డిమాండ్ చేసింది. పలు హింసాత్మక ఘటనలకు పాల్పడింది. దీంతో భారత ప్రభుత్వం
ఈ సంస్థను 1990లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధం విధించింది. ఈ సంస్థకు చైనా
అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర వాద చర్యలు కారణంగా పదివేలమంది అస్సామీ
యువకులు ప్రాణాలు కోల్పోయారు.