Ravindra jadeja available for second test with SA
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు అందుబాటులోకి
రవీంద్ర జడేజా
దక్షిణాఫ్రికాతో (South Africa) మొదటి
టెస్ట్మ్యాచ్లో ఓడిపోయిన భారత్ (Bharat), ఆఖరిదీ రెండవదీ అయిన టెస్ట్మ్యాచ్లో (Second
Test match) గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. అలాంటి భారత జట్టుకు
రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అందుబాటులోకి రావడం రెండో టెస్ట్ విజయంపై ఆశలు
కలిగిస్తోంది.
స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మొదటి టెస్ట్‌మ్యాచ్
ఆడలేకపోయాడు. వెన్నునొప్పి కారణంగా సెంచూరియన్ గ్రౌండ్ పెవిలియన్‌లోకి
అడుగుపెట్టలేకపోయాడు. అయితే ఇఫ్పుడు అతను పూర్తి ఫిట్‌గా తయారయ్యాడు. కేప్‌టౌన్‌లో
జరగబోయే రెండో టెస్ట్‌మ్యాచ్ సెలక్షన్స్‌కి రవీంద్ర జడేజా అందుబాటులో ఉన్నాడని
బీసీసీఐ వర్గాలు తెలియజేసాయి. రవీంద్ర జడేజా మొదటి టెస్ట్ మూడో రోజు ఆటలో
సెంచూరియన్ స్టేడియం గ్రౌండ్లో కనిపించాడు. తర్వాత ప్రాక్టీస్‌లో కూడా
పాల్గొన్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేసాడు.
రెండో టెస్ట్‌మ్యాచ్ కోసం బీసీసీఐ సెలక్షన్
కమిటీ అవేష్ ఖాన్‌ను ఎంపిక చేసింది. అవేష్ ప్రస్తుతం భారత్-ఎ జట్టుకు ఆడుతున్నాడు.
ఈ యువ బౌలర్ రాకతో పేస్బౌలింగ్లొ టీమ్ బలం మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తప్పించే అవకాశముంది.
రెండో టెస్ట్ మ్యాచ్ జనవరి 3నుంచి మొదలవుతుంది. ఆ
మ్యాచ్‌కు కేప్‌టౌన్ ఆతిథ్యం ఇస్తోంది.