భార్యా భర్తల మధ్య సంబంధాలు (crime news) మూన్నాళ్ల ముచ్చటగా మిగులుతున్నాయి. తాజాగా హైదరాబాద్ ఉప్పల్‌లో భార్యకు వీడియో కాల్ చేసి, ఆమెను లైవ్‌లోనే ఉంచి భర్త ఉరేసుకున్న ఘటన సంచలనంగా మారింది. యాదాద్రి జిల్లా కందుకూరుకు చెందిన నరేష్‌కు ఏడాది కిందటే వివాహమైంది. నరేష్ భార్య అమ్మనబోలుకు చెందిన నిత్యశ్రీ సీమంతానికి పుట్టింటికి వెళ్లింది. అయితే సీమంతానికి బంధువులను ఎవరిని పిలవాలనే విషయంలో భార్యా, భర్తల మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోందని తెలుస్తోంది. దీనికి తోడు ఆస్తి గొడవలు కూడా ఉన్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
భార్యతో గొడవలు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురైన నరేష్ శుక్రవారం రాత్రి నిత్రశ్రీకి వీడియో కాల్ చేశాడు. అప్పటికే ఫ్యానుకు చీరతో ఉరి బిగించి సిద్దం చేసుకున్నాడు. భార్య లైవ్‌లో ఉండగానే నరేష్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.