తిరుమలలో ఇటీవల చిరుతల కలకలం తగ్గాయనుకుంటున్న తరుణంలో తాజాగా అలాంటి ఘటన ఆందోళన కలిగిస్తోంది. తిరుమల (tirumala tirupati) కాలిబాటకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబండి కదలికల రికార్డైన వీడియోలు కలకలం రేపాయి. డిసెంబరు 13వ తేదీ, 29 తేదీల్లో చిరుత కెమెరాలకు చిక్కిందని అటవీ అధికారులు గుర్తించారు.
తిరుమలలో మరలా చిరుత కదలికలు నమోదు కావడంతో కాలిబాట భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా కాలిబాటలో నడక సాగించాలని కోరారు. పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచించింది. చిరుత, ఎగులుబంటి కదలికలు నమోదయ్యాయన్న వార్తల నేపథ్యంలో కాలిబాట భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.