Botsa says the govt
accepted 10 demands of Anganwadis
రెండు, మూడు
రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం (Decision on DSC soon) వస్తుందని, దానిపై చర్చిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ
మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. అంగన్వాడీల ప్రతినిధులు ప్రభుత్వం ముందు పెట్టిన పది డిమాండ్లను (Anganwadi workers’
demands) ఇప్పటికే అంగీకరించామని, ప్రస్తుతం
ఎన్నికలకు వెళ్తున్నందువల్ల సమయాభావం దృష్ట్యా ప్రభుత్వాన్ని వారు అర్థం
చేసుకోవాలని కోరారు. శుక్రవారం విజయనగరంలో ఆయన మాట్లాడారు.
వైఎస్సార్సీపీ
ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం కంటే రూ.వెయ్యి
పెంచుతామని హామీ ఇచ్చామని, ఆ ప్రకారం రూ.11
వేలు చేశామని తెలిపారు. ప్రతిసారీ పెంచుతామని తాము చెప్పలేదన్నారు. ఎమ్మెల్యేలకు
స్థానచలనం కల్పిస్తున్న వార్తల గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, స్థానిక
పరిణామాలను బట్టి ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేయడం సహజమని వ్యాఖ్యానించారు.
గతంలో టికెట్ ఇచ్చినవారికే ఈసారీ మరలా అవకాశమిస్తామని టీడీపీ కచ్చితంగా చెప్పగలదాఅని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు
చూసి, అన్నీ బాగున్నాయంటేనే తనకు ఓటేయాలని జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నారని,
చంద్రబాబు మాదిరి హామీలిచ్చి మోసం చేయలేదని స్పష్టం చేశారు.
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌కు వస్తే తమ పార్టీపై
ప్రభావం ఉండదని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేల
పనితీరు బాగుందని, మార్పులేమీ ఉండబోవని తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.