అయోధ్య
రాముడి దర్శనానికి ఓ ముస్లిం యువతి పాదయాత్రగా బయలు దేరింది. తన మిత్రులతో కలిసి
1,425 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన చేరుకుంటోంది.
ముంబైకి
చెందిన షబ్నమ్కు శ్రీరాముడింటే ఎంతో మక్కువ. అయోధ్యలో కొలువు దీరనున్న రాముడి
దర్శనం కోసం ఆమె పాదయాత్ర చేస్తోంది. తన మిత్రులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేలతో
కలిసి తన నడకను ప్రారంభించింది.
శ్రీరాముడు,
ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయుడంటున్న షబ్నమ్, రాముడిని ఆరాధించేందుకు మతం ఏ మాత్రం
అడ్డుకాదని చెబుతున్నారు. సర్వగుణాభిరాముడిని పూజించేందుకు మంచి మనస్సు ఉంటే చాలు
అని చెబుతున్నారు.
మధ్య
ప్రదేశ్ నుంచి ప్రారంభమైన ఆమె పాదయాత్ర రోజుకు 25నుంచి 30 కిలోమీటర్లు సాగుతోంది.
రాముడి ఎడల ఉన్న ప్రేమాభిమానాలతో తమకు
పాదయాత్రలో ఎలాంటి అలసట అనిపించడం లేదని షబ్నమ్ , ఆమె మిత్రులు చెబుతున్నారు. వీరి
ఆద్మాత్మిక పాదయాత్ర గురించి తెలుసుకున్న యువత, సనాతనులు దారి పొడవునా స్వాగతం
పలుకుతూ అభినందనలు తెలపడంతో పాటు సెల్ఫీలు దిగుతున్నారు.
రాముడిపై
భక్తి ఏ ఒక్క మతానికో చెందినది కాదని,
సరిహద్దులు దాటి ప్రపంచాన్ని చుట్టిముడుతుందని షబ్నమ్ కుటుంబ సభ్యులు
చెబుతున్నారు. మతంతో సంబంధం లేకుండా రాముడు అందరివాడు అని చెప్పేందుకు షబ్నమ్
యాత్ర చేస్తోందంటున్నారు.
పాదయాత్రలో
ఆమెకు పలు సవాళ్ళు కూడా ఎదురవుతుండటంతో పోలీసులు ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. అలాగే
బసకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆమె
పాదయాత్రకు అవరోధాలు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
రాముడిని ఆరాధించడం పట్ల తనపై కొందరు ద్వేషం
ప్రదర్శించడాన్ని కూడా ఆమె తప్పుబట్టడం లేదు. చెడు కంటే మంచినే ఎక్కువగా
చూస్తున్నానంటున్నారు.
దారి పొడవునా కాషాయ జెండాలతో జనం స్వాగతం పలకడంతో తన మనస్సు
పులకించిపోతుందంటున్నారు. ముస్లింలతో సహా
పలువురు జై శ్రీరామ్ అని నినదించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు.
షబ్నమ్ ప్రయాణాన్ని పలవురు కొనియాడుతున్నారు.
భక్తికి, ప్రేమకు సరిహద్దులు లేవని చెప్పేందుకు షబ్నమ్ నే ఉదాహరణ అని
ప్రశంసిస్తున్నారు.