Nitish JDU New Chief
జనతాదళ్
యూనైటెడ్(JDU) పార్టీ అధక్షుడు రాజీవ్ రంజన్
అలియాస్ లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దిల్లీలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ
సమావేశంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్(nitish kumar) ను పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. లలన్, నితీశ్ మధ్య విభేదాలు
ఉన్నాయని జేడీయూ నాయకత్వం మారబోతుందని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేశాయి.
‘‘ పార్టీ
జాతీయ కార్యవర్గం సమావేశంలో నితీశ్ పేరును లలన్ ప్రతిపాదించగా సభ్యులంతా
ఆమోదించారని’’ బిహార్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. ప్రస్తుత పరిణామంతో 2024 లోక్ సభ ఎన్నికలతో
పాటు 2025 లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు నితీశే, జేడీయూ అధినేతగా కొనసాగే
అవకాశముంది.
దిల్లీలో ఇండీకూటమి సమావేశం రేపు జరగనుంది. ఈ
సమయంలో జేడీయూ నాయకత్వ మార్పిడి అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇండీ
కూటమి బాధ్యతలు నితీశ్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తోన్న జేడీయూ నేతలు, తాజాగా
ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని నినాదాలు చేశారు. నితీశ్ నాయకత్వాన్ని
బిహార్ గుర్తించిందని ఇక దేశమే గుర్తించాల్సి ఉందనే పోస్టుర్లు దిల్లీలో వెలిశాయి.
రాజీవ్
రంజన్ అలియాస్ లలన్ సింగ్, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు
బిహార్ డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్ తో సన్నిహితంగా మెలుగుతున్నారని వచ్చే ఎన్నికల్లో
ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ముంజెర్
లోక్ సభ స్థానం నుంచి లలన్ పోటీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
ఇండీ కూటమిలో జేడీయూ విధానాలను చర్చించడంలో లలన్
విఫలమయ్యాడని పలువురు జేడీయూ నేతలు ఆరోపిస్తున్నారు.