దక్షిణాఫ్రికా
సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓడినప్పటికీ, రెండో ఇన్నింగ్స్ లో
మెరుగైన స్కోర్ చేసిన
విరాట్
కోహ్లీ, క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘనత సాధించాడు.
వరుస
కేలండర్ ఈయర్స్ లో వరుసగా ఏడుసార్లు 2 వేల పైన పరుగులు చేసి రికార్డు సృష్టించారు.
146 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుతమని పలువురు క్రికెట్ నిపుణులు
కొనియాడుతున్నారు. 1877 నుంచి క్రికెట్ లెక్కలు పరిశీలిస్తే మరే ఇతర ఆటగాడు ఈ ఘనత
సాధించిన దాఖలాలు లేవు.
సెంచురియన్
టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ 82 బంతులు ఆడి 76 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. దీంతో ఈ ఏడాదిలో అతను 2వేల పరుగుల మార్క్ ను
దాటాడు.
2012లో
(2,186), 2014 లో(2,286), 2016లో 2,595
పరుగులు చేసిన కోహ్లీ 2017లో కూడా 2
వేల మార్క్ దాటాడు. ఈ తర్వాతి ఏడాదిలో 2,735
పరుగులు చేసి రికార్డుకెక్కాడు. 2019లొ 2,455
పరుగులు చేసి మరోఏ క్రికెటర్ సాధించని ఘనతను కైవసం చేసుకున్నాడు.