South Africa wins by an innings and 32 runs
దక్షిణాఫ్రికాతో
తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడింది. మూడో రోజే భారత్
చేతులెత్తేయడంతో సఫారీ జట్టు విజయం సాధించింది.
163 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో
రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ జట్టు 131 పరుగులకే ఆలౌట్ అయింది.
రెండో
ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్ తో
సరిపెట్టుకున్నారు. కోహ్లీ 76 పరుగులతో చివరి వికెట్ గా వెనుతిరగగా, గిల్ 26 పరుగులు
చేశాడు. రోహిత్ శర్మ, రవిచంద్రన్, బుమ్రా డకౌట్ అయ్యారు. యశస్వీ జైస్వాల్(5),
శ్రేయస్ అయ్యర్(6), కేఎల్ రాహుల్(4), శార్దూల్ ఠాకూర్(2), సిరాజ్(4) పరుగులకు ఔట్
అయ్యారు.
సౌతాఫ్రికా
బౌలర్లలో నాండ్రే బర్గర్, నాలుగు వికెట్లు తీయగా, మార్కో యన్సెన్ 3, రబాడా 2
వికెట్లు తీశారు. రెండు టెస్టుల సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఇరు జట్లు మధ్య రెండో టెస్ట్ జనవరి 3 నుంచి కేప్‌టౌన్ లో జరగనుంది.
సెంచూరియన్
వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్
పాయింట్ల పట్టికలో భారత్ స్థానం 5కు దిగజారింది. 66.67 పాయింట్ల నుంచి 44.44
పాయింట్లకు పడిపోవడంతో 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
దక్షిణాఫ్రికా
తొలి స్థానంలో ఉండగా పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. మూడు, నాలుగు స్థానాల్లో
న్యూజీలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. భారత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా జట్టు ఉంది.