Amrit Bharat, Vande Bharat trains: అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు శనివారం నుంచి
పట్టాలెక్కనున్నాయి. వీటిలో పశ్చిమబెంగాల్-బెంగళూరు మధ్య నడిచే రైలు ఆంధ్రప్రదేశ్
మీదుగా ప్రయాణించనుంది. ఆంధ్రప్రదేశ్లోని తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు,
విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రాకపోకలు
సాగించనుంది.
ఈ రైలులో 12 స్లీపర్ కోచ్లు, 8 జనరల్ బోగీలు ఉండనున్నాయి. గంటకు 130
కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీనిని రూపొందించారు.
డిసెంబర్
30న రెండు అమృత్ భారత్, ఆరు వందే భారత్ రైళ్ళను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయోధ్య ధామ్
జంక్షన్ నుంచి వీటిని జెండా ఊపి ప్రారంభిస్తారు.
పుష్-పుల్ ఇంజిన్లు వాడకం అమృత్ భారత్
రైళ్ల మరో ప్రత్యేకత. రైలు ముందూ వెనుక ఇంజిన్లు ఉంటాయి.
ఒక ఇంజిన్ బోగీలను లాగితే, మరొకటి నెడుతుంది. వంపు
మార్గాలు, వంతెనల పైనుంచి
ప్రయాణించేటప్పుడు వేగాన్ని నియంత్రించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.
బోగీల్లో సీసీ కెమెరాలతో పాటు మొబైల్
చార్జింగ్ పాయింట్లు, లైట్లు, ఫ్యాన్లు ఉంటాయి. సమాచారాన్ని తెలిపేందుకు ఎల్ఈడీ
డిస్ ప్లే బోర్డు కూడా ఉంటుంది. అలాగే బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ ట్యాప్స్
అమర్చారు. 800 కిలోమీటర్ల దూరం ఉన్న నగరాల మధ్య వీటిని తిప్పనున్నారు.