అప్పులు ప్రాణాలు తోడేస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య (crime news) చేసుకున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అప్పుల వారి నుంచి ఒత్తిడి తట్టుకోలేక వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
తెనాలికి చెందిన బంగారు ఆభరణాలు తయారు చేసే శివరామకృష్ణ కుటుంబం, అనకాపల్లిలో ఉంటోంది. గురువారం అర్థరాత్రి శివరామకృష్ణ, ఆయన భార్య మాధవి, కామార్తెలు వైష్ణవి, లక్ష్మి, కుసుమప్రియ విషం తాగారు. వీరిలో కుసుమప్రియ ఆసుప్రతిలో చికిత్స పొందుతోంది. మిగిలిన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. సైనేడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.