బాక్సింగ్
డే టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్
చేసి భారత్ పై 163 పరుగుల ఆధిక్యం సాధించింది.
డీన్
ఎల్గార్(185), మార్కో యన్సెన్(84*)
డేవిడ్ బెడింగ్ హామ్(56) రాణించడంతో సౌత్ ఆఫ్రికా 9 వికెట్లు నష్టపోయి 408 పరుగులు
చేసింది. గాయం కారణంగా బావుమా బ్యాటింగ్ కు దిగలేదు.
సఫారీ జట్టును భారీ స్కోరు
దిశగా నడిపించిన డీన్ ఎల్గర్ 185 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన
94.5 బంతికి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 96 ఓవర్లు
ముగిసే సరికి సౌతాఫ్రికా ఆరు వికెట్లు
నష్టపోయి 366 పరుగులు చేసింది. అశ్విన్ వేసిన 99 ఓవర్ మొదటి బంతికి సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి
గెరాల్డ్ కోయెట్జీ (19) వెనుదిరిగాడు.
మూడో రోజు ఆటలో భాగంగా భోజన విరామ సమయానికి
100 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 392 పరుగులకు సఫారీ స్కోరు బోర్డు చేరింది. లంచ్
బ్రేక్ తర్వాత తొలి ఓవర్ లోనే భారత్ కు వికెట్ దక్కింది. బుమ్రా బౌలింగ్ లో కగిసో
రబడ(1) బౌల్డ్ అయ్యాడు. నండ్రీ బర్గర్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో
దక్షిణాఫ్రికా తొమ్మిదో వికెట్ నష్టపోయింది.
భారత
బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ రెండు, శార్దూల్
ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
మొదటి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు భారత్ ఆలౌటైంది.
రెండో ఇన్నింగ్స్ కూడా చప్పగానే ప్రారంభమైంది.
రోహిత్ శర్మ, యశస్వీ ఓపెనర్లుగా మొదటి ఓవర్ లో ఒకే ఒక పరుగు సాధించారు. రబాడ వేసిన
2.5 బంతికి రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యశస్వీ జైపాల్, శుభమన్ గిల్
ఆడుతున్నారు.