పార్టీలో వర్గ విభేదాల వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో నష్టపోయామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amitsha telangana tour) అభిప్రాయపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన ఇవాళ హైదరాబాద్లోని నొవాటెల్ హోటళ్లో కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్దం కావాలనే విషయంలో ఆయన బీజేపీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమను నిరాశ పరిచాయని ఆయన అన్నారు. కనీసం 30 సీట్లు వస్తాయని ఆశించామన్నారు. అనుకున్న లక్ష్యం సాధించలేకపోయినట్లు ఆయన వెల్లడించారు. లోక్సభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలని పార్టీ నేతలకు సీరియస్గా హెచ్చరించినట్లు తెలుస్తోంది. సిట్టింగులందరికీ అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు. మిగిలిన చోట్ల నేతల పనితీరు ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శంషాబాద్ ఎయిర్పోర్టులో కిషన్రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ స్వాగతం పలికారు.