Pegasus spyware:
పెగాసస్
వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. యాపిల్ కంపెనీ నుంచి హ్యాక్ అలర్ట్ సమాచారం
అందిన తర్వాత ఇద్దరు భారతీయ జర్నలిస్టుల
ఫోన్లలో తాము పెగాసస్ సాఫ్ట్వేర్ ను గుర్తించినట్లు ఎన్జీవో అమ్నెస్టీ
ఇంటర్నేషనల్ తెలిపింది.
ది వైర్
పత్రిక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ సహా మరో జర్నలిస్టు ఫోన్లను ల్యాబ్ లో
పరీక్షించగా ఈ విషయం తేలిందని పేర్కొంది. జర్నలిస్టుల వ్యక్తిగత గోప్యత, భావ
వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన అమ్నెస్టీ , ప్రజల
మానవ హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతీ దేశానిదని గుర్తు చేసింది.
ఈ
ఏడాది అక్టోబర్ లో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు హ్యాకింగ్ అలర్టులు రాగా దీనిపై
యాపిల్ వివరణ ఇచ్చింది. ఇలాంటి మెసేజ్ లు 150 దేశాలకు వెళ్ళాయని తెలిపింది. ఈ విషయంపై
అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక మాత్రం భిన్నమైన కథనం ప్రచురించింది. ప్రభుత్వమే
యాపిల్ కంపెనీపై ఒత్తిడి తెచ్చి ఇలాంటి ప్రకటన చేయించిందని కథనంలో పేర్కొంది.
ఇజ్రాయెల్
కు చెందిన ఎన్ఎస్వో గ్రూపు పెగాసస్ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసి, ప్రభుత్వాలకు
మాత్రమే ఈ టెక్నాలజీని విక్రయిస్తోంది. మన ఇంటెలిజిన్స్ బ్యూరో ఈ సంస్థ నుంచి 2017లో
కొన్ని పరికరాలు కొనుగోలు చేసింది.