Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

గుడి భూమిలో క్రైస్తవ పాఠశాల, ఖాళీ చేయాలని కోర్టు ఆదేశం

param by param
May 12, 2024, 01:50 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Temple land encroached
by Church school, HC orders eviction

11 ఎకరాల దేవాలయ భూమిని ఆక్రమించి (Temple land encroached), అక్రమంగా నిర్మించిన క్రైస్తవ పాఠశాలను ఖాళీ చేయించాలని మద్రాస్
హైకోర్ట్ డివిజన్ బెంచ్
(Madras High
Court Division Bench)
, సంబంధిత
అధికారులను ఆదేశించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా, అంబసముద్రం తాలూకా,
విక్రమసింగపురం పట్నంలో అమలి గరల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్
(Amali girls high school) విషయంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 33ఏళ్ళుగా
అన్యమతస్తుల ఆక్రమణలో ఉన్న హిందూ దేవాలయ భూమికి ఇప్పటికి విముక్తి లభించినట్లయింది.

పిల్లాయన్ ఆర్తిజమ్మ కట్టాలయ్ ట్రస్టు తమిళనాడు
హిందూమత ధర్మదాయ శాఖ అధీనంలో ఉంది. ఆ గుడికి సంబంధించిన భూముల విషయంలో కోర్టు
ఇచ్చిన తీర్పు, ఆ భూములపై ఆలయ ట్రస్టుకున్న హక్కుల పునరుద్ధరణకు అవకాశం
కల్పించింది. ఈ న్యాయవివాదం డిసెంబర్ 5న ఒక కొలిక్కి వచ్చినట్లయింది. అమలి గరల్స్
హయ్యర్ సెకండరీ స్కూల్ అండ్ అమలి కాన్వెంట్‌ మదర్ సుపీరియర్ దాఖలు చేసిన మూడు రిట్
పిటిషన్లను మద్రాస్ హైకోర్ట్ మదురై బెంచ్ ఆరోజు కొట్టేసింది.
(Three
writs quashed)

కోర్టు తన ఉత్తర్వులో అమలి పాఠశాలను ఖాళీ
చేయించాలన్న ఆదేశాలు సరైనవేనని  సమర్ధించింది. తిరునల్వేలి జిల్లా అరుళ్‌మిగు
పాపనాశ స్వామి ఆలయ పరిధిలో ఉన్న పిల్లాయన్ ఆర్తిజమ్మ కట్టాలయ్ ట్రస్టుకు సంబంధించిన
ఆస్తిని అమలి కాన్వెంట్ అక్రమంగా ఆక్రమించుకుందని కోర్టు స్పష్టం చేసింది.
చిన్నపిల్లల చదువుల సాకుతో ఆక్రమిత భూమిని వదలకుండా ఉండేందుకు పిటిషనర్లు చేసిన
ప్రయత్నాలను న్యాయస్థానం తీవ్రంగా విమర్శించింది.

ఈ న్యాయపోరాటం 2011లో మొదలైంది.
దేవాలయానికి చెందిన భూమి ఆక్రమణలో ఉందని తెలుసుకున్న ఎం మారియప్పన్ అనే భక్తుడు ఆందోళన
వ్యక్తం చేస్తూ దేవదాయ శాఖను తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ అప్రమత్తం
చేసాడు. కోర్టు రికార్డుల ప్రకారం అమలి కాన్వెంట్‌కు గతంలో 11 ఎకరాల భూమిని నాలుగు
ముక్కలుగా లీజుకు ఇచ్చినట్లు పత్రాలున్నాయి. వాటి ఆధారంగా వేసిన పిటిషన్‌ను  1985లో అంబసముద్రంలోని జిల్లా మున్సిఫ్ కోర్టు
కొట్టిపడేసింది. దానిపై పిటిషనర్ తెన్‌కాశి లోని సబ్ కోర్టులో అప్పీల్ చేసాడు.

పిల్లాయన్ ఆర్తిజమ్మ కట్టాలయ్ ట్రస్టు,
తిరునల్వేలి జిల్లాలో తామ్రపర్ణి నది ఒడ్డున ఉన్న పాపనాశం శివన్ ఆలయంలో పూజలు, ఇతర
ధార్మిక వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఆలయం మాన్యం భూములను పాఠశాలను
లీజుకివ్వడం ద్వారా వస్తున్న ఆదాయం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఐతే 11 ఎకరాల
స్థలానికి చెల్లించే వార్షిక అద్దె నామమాత్రమే, మార్కెట్ రేటు కంటె చాలా చాలా తక్కువ.

మొదటి అప్పీలు తర్వాత ఒక రాజీ ఒప్పందం
ప్రతిపాదన వచ్చింది. దాని ప్రకారం అమలి కాన్వెంట్ యాజమాన్యం కొంత భూమిని ట్రస్టుకు
ఇచ్చి 11 ఎకరాల భూమిని మాత్రం తమ అధీనంలో ఉంచుకుంటుంది. ఐతే సెటిల్మెంట్‌లో
ఒప్పుకున్న నియమాలను ఉల్లంఘించి అమలి కాన్వెంట్ అనధికారికంగా నిర్మాణాలు
చేపట్టింది. దాంతో 2012లో ఎవిక్షన్ నోటీసు జారీ అయింది. భూమిని వ్యవసాయ అవసరాలకు
వినియోగించకుండా అక్రమంగా శాశ్వత కట్టడాలు నిర్మించడాన్ని తప్పుపడుతూ దేవదాయ శాఖ
2013లో మరోసారి ఎవిక్షన్ నోటీసులు జారీ చేసింది.

ఆ నోటీసులను సవాల్ చేస్తూ అమలి కాన్వెంట్
2013లో కోర్టుకెక్కింది. విద్యార్ధుల చదువులకు ఇబ్బందులు కలుగుతాయనే కారణంతో
న్యాయస్థానం మూడు వారాల పాటు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 2013లో
స్టేటస్ కో వ్యవధి ముగిసాక తుది తీర్పు వెలువరించింది. ఆ ఉత్తర్వులలో ఆక్రమిత
భూమిని స్వాధీనం చేసుకునే అధికారం దేవదాయ శాఖకు ఉందని కోర్టు స్పష్టం చేసింది.

ఇక న్యాయస్థానం తన తాజా ఆదేశాల్లో,
కాన్వెంట్ వాదనలను తిరస్కరించింది. భూమిని ఖాళీ చేయమనడం వల్ల బాలికల చదువు
ఆగిపోతుందని కాన్వెంట్ చేసిన వాదనను త్రోసిపుచ్చింది. పాఠశాలను మరో ప్రదేశానికి
మార్చుకోడానికి తగినంత సమయం ఇచ్చామని గుర్తు చేసింది. ‘చిన్నపిల్లల సంక్షేమం’
పేరిట నాటకాలు ఆడుతున్నారంటూ దుయ్యబట్టింది. తద్వారా చట్టపరమైన జవాబుదారీతనాన్ని
తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. అలాంటి చిట్కాల కంటె ఆలయ
పునరుద్ధరణ ఆవశ్యకమని కుండ బద్దలుగొట్టి మరీ స్పష్టం చేసింది.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.