అయోధ్యలో
త్రిసంధ్యల్లో శ్రీరాముడికి ఇచ్చే హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద
ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. జనవరి 22న భవ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ
ప్రాణప్రతిష్ట సందర్భంగా అక్కడ మూడు పూట్ల హారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆన్లైన్
లో పాసులు జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు, ఓటరు ఐటీ లేదా ఇతర డాక్యుమెంట్స్
ఆధారంగా పాసులు అందజేస్తున్నారు.
ఉదయం
6గంటల30 నిమిషాలకు మధ్యాహ్నం 12 గంటలకు
రాత్రి 7 గంటల 30 నిమిషాలకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించాలని
నిర్ణయించింది. ఉదయం ఇచ్చే హారతికి సింగార్ గా నామకరణం చేసిన పండితులు మధ్యాహ్నం
బోగ్ హారతి, రాత్రికి సంధ్యహారతిని స్వామికి ఇవ్వనున్నారు.
పాసులు ఉన్న వారు
మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. భద్రతా నిబంధనల్లో భాగంగా ప్రతీ హారతికి కేవలం 30 మందికి ఈ అవకాశం
కల్పిస్తున్నారు. ఆన్లైన్ లోనే పాసులు జారీ చేస్తున్నారు.