Priyanka Gandhi’s name
in ED’s PMLA case charge-sheet
కాంగ్రెస్ యువరాణి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) పేరు మొట్టమొదటిసారి ఒక అవినీతి కేసు ఛార్జిషీట్‌లోకి ఎక్కింది.
హర్యానాలో ఐదెకరాల వ్యవసాయ భూమి కొని, నాలుగేళ్ళ తర్వాత అదే ఏజెంట్‌కి ఆ భూమిని
అమ్మేసిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రియాంకా గాంధీ పేరును
మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్లో (PMLA
case charge-sheet) చేర్చింది.
ప్రియాంకా గాంధీ 2006లో ఢిల్లీకి చెందిన
రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా నుంచి హర్యానాలోని ఫరీదాబాద్ దగ్గర అమీపూర్
గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసింది. ఆ భూమిని మళ్ళీ అదే పహ్వాకు 2010
ఫిబ్రవరిలో అమ్మేసింది. (Land
transactions)
ఈడీ కథనం ప్రకారం… 2005-06 సమయంలో
ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా (Robert
Vadra) అదే రియల్ ఎస్టేట్ ఏజెంట్ పహ్వా దగ్గర అదే
అమీపూర్ గ్రామంలో 40 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసాడు. వాద్రా కూడా ఆ భూమిని
అదే పహ్వాకు 2010 డిసెంబర్లో అమ్మేసాడు.
ఆ ఏజెంటే దాదాపు అదే సమయంలో ప్రవాసభారతీయ
వ్యాపారవేత్త సీసీ థంపికి (CC
Thampi) కూడా భూమి విక్రయించాడు. ఈ కేసులో దేశం నుంచి పరారీలో
ఉన్న ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ (Sanjay
Bhandari) ప్రమేయం కూడా ఉంది. మనీలాండరింగ్, ఫారిన్ ఎక్స్ఛేంజ్,
నల్లధనం, అధికార రహస్య చట్టాల ఉల్లంఘన కేసుల్లో సంజయ్ భండారీపై వివిధ సంస్థలు
దర్యాప్తు చేస్తున్నాయి. సంజయ్ భండారీ 2016లో భారతదేశం వదిలిపెట్టి ఇంగ్లండ్‌కు పారిపోయాడు.
భండారీ పాల్పడిన నేరాల వివరాలను దాచిపెట్టిన ఆరోపణలు థంపి మీద, సుమిత్ ఛద్దా (Sumit Chadda) అనే
బ్రిటిష్ జాతీయుడి మీద ఉన్నాయి.
ఈ కేసుకు సంబంధించి గతంలో నమోదు చేసిన ఛార్జిషీట్లో
ఈడీ, థంపి సన్నిహిత మిత్రుడిగా రాబర్ట్ వాద్రా పేరు చేర్చింది. తాజా ఛార్జిషీట్లో
‘భూసేకరణ కోసం పహ్వా, ఖాతా పుస్తకాల ద్వారా నగదు పొందుతుండేవాడు. అతను పహ్వాతో
వ్యాపారం గురించి ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహించలేదని చెప్పాడు. ఈ వ్యవహారంలో ఈడీ
దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే పహ్వా లెడ్జర్ ఖాతాల కాపీని పరిశీలిస్తే,
ఈ భూముల వ్యవహారాలు 2023 నవంబర్ 17న జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
‘‘రాబర్ట్ వాద్రా ఈ వ్యవహారాలను స్కైలైట్
హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, స్కైలైట్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 2007
నవంబర్ 1, 7వ తేదీల్లో చేసినట్లు వెల్లడించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన వివరాల్లో కూడా అలాగే
ఉంది. అయితే స్కైలైట్ ఇన్వెస్ట్మెంట్, యుఎఇ అనే సంస్థ 2009 ఏప్రిల్ 1న
ఏర్పాటయింది. దానికి ఏకైక షేర్‌హోల్డర్ సీసీ థంపి’’ అని ఈడీ ఛార్జిషీట్
వివరించింది.
‘‘థంపి, అతని భారతీయ సంస్థల గురించి
ఫెమా,1999 నియమాల ప్రకారం దర్యాప్తు చేస్తున్న క్రమంలో… థంపి 2005 నుంచి 2008
మధ్యలో హర్యానా ఫరీదాబాద్ జిల్లా అమీపూర్ గ్రామంలో సుమారు 486 ఎకరాలు కొనుగోలు చేసాడని
తెలిసింది. ఆ భూములను అతడు ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా దగ్గర కొన్నాడని వెల్లడైంది’’ అని
చార్జిషీట్ పేర్కొంది.
సీసీ థంపి, సంజయ్ భండారీ, సుమిత్ ఛద్దా, రాబర్ట్
వాద్రా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ తన ఛార్జిషీట్లో వివరించింది. ఒకేరకమైన
వ్యాపార ప్రయోజనాల కోసం వారు అక్రమమార్గాలను అనుసరించారని వెల్లడించింది. థంపి,
సుమిత్ ఛద్దా మీద ఛార్జిషీట్ నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది.
ఈ విచారణలో భాగంగానే ప్రియాంకా గాంధీ
కొనుగోలు చేసిన భూముల వ్యవహారాలు బైటకు వచ్చాయి. దాంతో ఈడీ తమ ఛార్జిషీట్లో ఆమె
పేరును చేర్చింది. అయితే ప్రియాంకను ఇందులో నిందితురాలిగా పేర్కొనలేదు.