six Covid-19 deaths, 692 new cases in 24 hrs
దేశంలో
మళ్ళీ కరోనా భయాందోళనలు మొదలయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారిన పడి 16
మంది ప్రాణాలొదలగా, 692 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం కోవిడ్ క్రియాశీల
కేసుల సంఖ్య 4,097 గా ఉన్నట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
మహారాష్ట్రలో
ఇద్దరు, దిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్ లో ఒక్కరు చొప్పున వైరస్ సోకి
ప్రాణాలు విడిచారు.
ఇప్పటి
వరకు దేశంలో 4,50, 10,944 మందికి కోవిడ్ సోకినట్లు సోకినట్లు అధికారులు తెలిపారు.
తాజా మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఈ వైరస్
కారణంగా మృతిచెందిన వారు 5,33,346 మంది.
దిల్లీలో
కోవిడ్ -19 జేఎన్.1 వేరియంట్ కేసు తొలిసారిగా బుధవారం వెలుగులోకి వచ్చింది. మొత్తం
మూడు శాంపిళ్ళను పరీక్షకు పంపగా ఒక్కరికి జేఎన్.1 వేరియంట్ సోకినట్లు , మిగతా
ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని
దిల్లీ ఆరోగ్యమంత్రి సూరభ్ భరద్వాజ్ వెల్లడించారు.
ఒమిక్రాన్
సబ్ వేరియంటే జేఎన్.1 గా రూపాంతరం చెందింది. ఈవేరియంట్ ను మొదటిసారిగా కేరళలో
గుర్తించారు. భారత్ లో ఇప్పటి వరకు 109 మందికి సోకింది.
ప్రస్తుతం
అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల మేరకు జేఎన్.1 వేరియంట్ పెద్ద ప్రమాదకారి కాదని
ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా
కేసులు పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
అనుమానాస్పద వ్యక్తులను పరీక్షించడంతో పాటు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.
వైరస్ కట్టడికి తగిన చర్యలను తీసుకోవడంతో పాటు ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాలని
తెలిపింది.