ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని తరలింపు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలించడంపై రైతులు వేసిన పిటీషన్‌పై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారించింది. కార్యాలయాల తరలింపు అడ్డుకోవాలంటూ రాజధాని రైతులు వేసిన పిటీషన్‌పై గతంలో విచారించిన ఏకసభ్య ధర్మాసనం, కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది.
ఏపీ ప్రభుత్వం వేసిన వేసిన లంచ్‌మోషన్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చే వరకు కార్యాలయాల తరలింపు చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.ఇందులో భాగంగా ఇవాళ ప్రభుత్వం వేసిన లంచ్‌మోషన్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.