SA lead by 11 runs v Bharat
బాక్సింగ్
డే టెస్టులో భాగంగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్నమ్యాచులో రెండోరోజూ సఫారీ
జట్టే ఆధిక్యం ప్రదర్శించింది. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో భారత బౌలర్లు రాణించలేకపోయారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 265/5 స్కోరు చేసి 11 పరుగుల ఆధిక్యంతో పైచేయి సాధించింది.
సరైన వెలుతురు
లేకపోవడంతో రెండో రోజు ఆటను 66 ఓవర్ల వద్ద నిలిపివేశారు.
సెంచూరియన్
వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టు మెరుగైన
ఇన్నింగ్స్ ఆడింది.
ఎల్గర్ 140 బంతుల్లో సెంచరీ చేశాడు. డేవిడ్ బెడింగ్ హమ్ (56)
పరుగులతో తనవంతు సహకారం అందించాడు. ఓపెనర్ మార్క్రమ్ 5 పరుగులకు సిరాజ్ బౌలింగ్
లో పెవిలియన్ చేరాడు. డీన్ ఎల్గర్, టోనీ డీ జోర్జీతో కలిసి మంచి పునాది వేశారు.
వెలుతురు
లేమి కారణంగా రెండోరోజు ఆటను నిలిపివేసే సమయానికి ఎల్గర్ 140 పరుగులు, జాన్సెన్
మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు.
బుమ్రా,
సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.
రెండో
రోజో 208/8 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 245 పరుగులు
మాత్రమే చేయగల్గింది. కేఎల్ రాహుల్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు.
సెంచరీ
చేసిన భారత వికెట్ కీపర్ రాహుల్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. కీలక సమయంలో భారత్
ను ఆదుకున్న రాహుల్ ను అభిమానులు ‘రెస్క్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటూ
కొనియాడుతున్నారు.
137 బంతులు ఆడి 101 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు
ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ కు వెన్నెముకలా
నిలిచిన రాహుల్, చివరి వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు.