వందేభారత్ తరవాత దేశంలో అందుబాటులోకి రాబోతోన్న అమృత్ భారత్ రైలు ఛార్జీలపై కొంత క్లారిటీ వచ్చింది. ఇప్పటికే నడుస్తోన్న సూపర్ ఫాస్ట్ రైళ్ల కన్నా అమృత్ భారత్ రైలులో 15 నుంచి 17 శాతం అదనంగా ఛార్జీలు ఉంటాయి. సెకండ్ క్లాస్, స్లీపర్లో మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే 15 నుంచి 17 శాతం అదనంగా ఛార్జీలుంటాయి. వాటితో పోల్చుకుంటే మెరుగైన (amruth bharat express rail ) సదుపాయాలతోపాటు వేగం కూడా ఎక్కువే. దీంతో ప్రయాణీకులకు సమయం ఆదా అవుతుంది. అమృత్ భారత్ రైలు గంటకు 130 కి.మీ వేగంతో దూసుకెళుతుంది.
ఎంత దూరానికి ఎంత ఛార్జీలుంటాయనే దానిపై రైల్వే బోర్డు ఒక ఛార్ట్ విడుదల చేసింది. ప్రభుత్వం రీయంబర్స్ చేయని రాయితీ టికెట్లను అమృత్ భారత్ రైలులో అనుమతించరు. ఎంపీలు, ఎమ్మెల్యేల రాయితీలు ప్రభుత్వం రైల్వేకు చెల్లిస్తోంది. కాబట్టి వారిని అనుమతిస్తారు. తొలి అమృత్ భారత్ రైలును ప్రధాని మోదీ ఈ నెల 30న అయోధ్యలో ప్రారంభించనున్నారు.