కోలీవుడ్ నటుడు విజయకాంత్ (actor vijayakanth nomore) కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంత కాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న విజయకాంత్, చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకున్న విజయకాంత్‌ను, ఇటీవల డాక్టర్లు ఇంటికి పంపించారు. అంతలోనే సమస్య తలెత్తడంతో ఆస్పత్రి పాలయ్యారు.
విజయకాంత్ తమిళనాడులోని మధురైలో 1952 ఆగస్టు 25న జన్మించారు. ఆయన అసలు పేరు నారాయన్ విజయరాజ్ అళగర్స్వామి. సినిమాల్లోకి వెళ్లాక విజయకాంత్‌గా పేరుమార్చుకున్నారు. ఆయన తల్లిదండ్రులు అలగర్‌స్వామి, ఆండాళ్ అజగర్‌స్వామి. భార్య ప్రేమలత. ఇద్దరు కుమారులున్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్ సగప్తం, మధుర వీరన్ చిత్రాల్లో నటించారు. విజయకాంత్ కెప్టెన్ ప్రభాకర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.