Bharat rice : ఆహార ధాన్యాల ధరల నియంత్రణకు కేంద్రప్రభుత్వం
చర్యలు చేపట్టిది. రోజురోజుకి పెరుగుతున్న బియ్యం ధరలకు కళ్ళెం వేయడమే లక్ష్యంగా
మార్కెట్ లోకి భారత్ బ్రాండ్ బియ్యం ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. సబ్సిడీతో
కిలోగ్రాము బియ్యాన్ని రూ. 25 కే అందజేసేందుకు ఎన్డీయే నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం
సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ నిర్ణయం
అమలులోకి రానుంది.
గోధుమ పిండి, శనగపప్పు లాగానే బియ్యాన్ని కూడా రాయితీతో పేదలకు
అందజేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
నేషనల్
అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్
కో ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (NCCF), కేంద్రీయ
భండార్ ఔట్ లెట్స్, మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయించాలనేది కేంద్రం యోచన.
గత ఏడాదితో
పోల్చుకుంటే బియ్యం ధర విపరీతంగా పెరిగింది.
గత సంవత్సరం బియ్యం కేజీ ధర రూ. 43.3
ఉండగా ఈ ఏడాది 14.1 శాతం పెరిగింది. దీంతో
ధరల నియంత్రణకు మోదీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
భారత్ బ్రాండ్ గోధుమ పిండిని కేజీ రూ. 27,50 కి ,శనగపప్పును
రూ. 60కి ఇప్పటికే అర్హులైన పేదలకు అందజేస్తోన్న ప్రభుత్వం తాజాగా ఈ జాబితాలోకి
బియ్యాన్ని కూడా చేర్చబోతుంది.
ఆహార ధాన్యాల ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం, బాస్మతియేతర రకాల ఎగుమతుల పై ఇప్పటికే
నిషేధం విధించింది. టన్ను ధర రూ. 1,200 కంటే ఎక్కువ ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులపై
కూడా ఆంక్షలు విధించింది.
భారత
ఆహార సంస్థ(fci) కూడా మార్కెట్ లో బియ్యం విక్రయిస్తోంది.