ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం
చేరువలో పేలుడు జరిగిందంటూ ఢిల్లీ పోలీసులకు వచ్చిన సమాచారంపై జాతీయ దర్యాప్తు
సంస్థ ఎన్ఐఏ (NIA) దర్యాప్తు చేస్తోంది. ఈ ఉదయం ఇజ్రాయెల్ ఎంబసీ (Israel Embassy in Delhi) వద్దకు ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ స్పెషల్ సెల్‌తోనూ, డాగ్ స్క్వాడ్‌తోనూ
వెళ్ళారు. పేలుడు జరిగిందంటూ వచ్చిన ఫోన్‌కాల్ గురించి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఢిల్లీ పోలీసులు (Delhi Police) సీసీటీవీ ఫుటేజ్ (CCTV
footage) పరిశీలించి, ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా
గుర్తించారు. ఐతే, ఆ ఘటనలో ఆ ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందా లేదా అన్న విషయం మాత్రం
ఇంకా ధ్రువీకరణ కాలేదు.
‘‘మంగళవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ఆ
పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించాం. పేలుడు ఘటనకు
సంబంధించిన ఫోన్‌కాల్ విషయంలో ఇంకా
స్పష్టత లేదు. వాళ్ళను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ సమయంలో ఆ ప్రదేశంలో వాళ్ళు
ఎందుకున్నారో తెలియాలి. వాళ్ళని ప్రశ్నించిన తర్వాతే ఆ విషయంపై స్పష్టత వస్తుంది’’
అని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
ఇద్దరు నిందితులు ఎవరో తెలుసుకోడానికి,
వారు చరించే మార్గాల గురించి తెలుసుకోడానికీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్
పరిశీలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ ‘బ్లాస్ట్ కాల్’కు సంబంధించి ఒక లేఖ
ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర ఢిల్లీ పోలీసులకు దొరికింది. ‘‘ఆ లేఖ ఇంగ్లీషులో (Threatening letter in English) ఉంది. ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయాన్ని బెదిరిస్తూ రాసారు. దాని మీద ‘సర్
అల్లా రెసిస్టెన్స్’ (Sir Allah
Resistance) అనే సంస్థ పేరు రాసి ఉంది’’ అని పోలీసులు
వెల్లడించారు. వారు ఇప్పుడు ఆ లేఖను పరీక్షిస్తున్నారు. దాని గురించి మరిన్ని
వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీ ఫైర్ సర్వీస్ పోలీసులకు
మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక కాల్ వచ్చింది. అందులో, ఇజ్రాయెల్ ఎంబసీ
చేరువలోని చాణక్యపురి ప్రాంతంలో ఆ పేలుడు జరిగినట్లు ఉంది. అయితే అలాంటి పేలుడు
జరిగిన దాఖలాలు ఏమీ లేవని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేసారు. (No blast at all) ఆ ప్రదేశంలో భద్రత మరింత
కట్టుదిట్టం చేసారు.