శబరిమలలో
కొలువైన శ్రీ అయ్యప్పస్వామికి రూ. 204 కోట్ల ఆదాయం వచ్చిందని తిరువాన్కూర్
దేవస్థానం బోర్డు (TDB) వెల్లడించింది. డిసెంబర్ 25 నాటికి 39
రోజులకు(ఈ సీజన్) గాను ఈ ఆదాయం లభించింది. భక్తులు సమర్పించిన నాణేల ద్వారా రూ.
63.89 కోట్ల ఆదాయం లభించగా, అరవణ ప్రసాదం విక్రయంతో రూ. 96.32 కోట్లు, అప్పం
ప్రసాదం అమ్మకంతో రూ. 12.38 కోట్లు వచ్చినట్లు టీడీబీ పేర్కొంది.
ఈ
నెల 25 వరకు శబరిమలేీశుడిని 31,43,163 మంది దర్శించుకోగా… 7, 25,049 మందికి
అన్నదానం చేశామని ఓ ప్రకటనలో తెలిపింది.
నేడు
శ్రీ అయ్యప్పస్వామికి పడి పూజ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం బోర్డు
అన్ని ఏర్పాట్లు చేసింది.
నేటి రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి, మకరవిలక్కు
పూజల కోసం 30 న తిరిగి తెరుస్తారు.
జనవరి
16న సాయంత్రం ఆరుగంటల 36 నిమిషాల 45 సెకన్లకు జ్యోతి దర్శనం లభించనుంది. మకర
విళక్కు మహత్వష్టం పూర్తయ్యాక స్వామి సన్నిధానాన్ని జనవరి 20 సాయంత్రం మూసేస్తారు.
ఆ తర్వాత భక్తులను స్వామి దర్శనానికి అనుమతించరు.
శబరిమలలో
అయ్యప్ప మాలధారుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. పినరయి విజయన్ ప్రభుత్వ తీరుతో
అయ్యప్ప దీక్షాధారులు నానా యాతన పడుతున్నారని దుయ్యబట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి
ఎంకే స్టాలిన్ చొరవ తీసుకుని కేరళప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు.
తమిళనాడు నుంచి
వెళ్ళిన అయ్యప్ప మాలధారులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని
కోరారు. కమ్యూనిస్టుల నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం, భక్తుల కనీస వసతుల కల్పనకు
తక్షణమే పూనుకోవాలన్నారు. రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.