Delhi caught in dense fog, 110 flights affected
ఉత్తరభారతదేశం అంతా పొగమంచులో (Dense fog) కూరుకుపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కన్ను పొడుచుకున్నా కనీసం
50 మీటర్ల దూరమైనా ఏమీ కనిపించని పరిస్థితి. అతి దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజధానికి 110 విమానాల రాకపోకలపై ఈ పొగమంచు ప్రభావం పడింది. ఇక ఢిల్లీ వైపు పయనించే 25 రైళ్ళు ఆలస్యంగా
చేరతాయని ఉత్తర రైల్వే ప్రకటించింది.
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పొగమంచు తీవ్రత అత్యంత అధికంగా ఉంటుందని భారత
వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో రహదారులు కనిపించక వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే మీద పలు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు
కోల్పోయాడు, 12మందికి గాయాలయ్యాయి. బరేలీ-సుల్తాన్పూర్ జాతీయ రహదారి మీద వేగంగా
వెడుతున్న ఒక ట్రక్కు పొగమంచు కారణంగా అదుపు తప్పి హైవే చేరువలోని ఒక ఇంట్లోకి
దూసుకునిపోయింది.
ఢిల్లీ రహదారుల మీద ఏమీ కనిపించడం లేదు. పాలం
విమానాశ్రయం చేరువలో విజిబిలిటీ 125 మీటర్లుగా ఉంది. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 50
మీటర్లు కూడా కనబడడం లేదు. పంజాబ్‌లోని పటియాలా, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ప్రయాగరాజ్
నగరాల్లో 25 మీటర్లయినా కనిపించడం లేదు. ఇంక పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లో
విజిబిలిటీ సున్నాకు పడిపోయింది.
ఢిల్లీలో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత
7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు యవది నగరంలో గాలి నాణ్యత కూడా బాగా తగ్గిపోయింది.
కొన్ని వారాలు గాలి నాణ్యత మెరుగుపడిన రోజులైనా గడవలేదు, మళ్ళీ పడిపోయింది. సగటు
గాలి నాణ్యత 381కి పడిపోయింది. వాయు నాణ్యత సూచీలో ఆ స్థాయిని ‘అత్యంత కనిష్ట’
స్థాయిగా పరిగణిస్తారు. వచ్చే వారం రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని
వాతావరణ శాఖ హెచ్చరించింది.