అయ్యోధ్య రామ మందిర నిర్మాణంలో సాయం అందించే అవకాశం హైదరాబాద్ కు చెందిన అనూరాధ టింటర్ ఎస్టేట్‌కు
దక్కింది. రాముడి ఆలయ ప్రధాన ద్వారంతో పాటు ఇతర వుడ్ వర్క్ పనులను ఈ సంస్థే
నిర్వహిస్తోంది. భవ్య రామమందిర నిర్మాణంలో భాగంగా 300లకు పైగా ద్వారాలు అవసరం కాగా
ఇప్పటికే ఈ సంస్థ 118 ద్వారాలకు తుది మెరుగులు దిద్దినట్లు కంపెనీ నిర్వాహకులు
చదలవాడ శరత్ బాబు తెలిపారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలోనూ తాము సేవలు అందించినట్లు
ఆయన వెల్లడించారు.
జనవరి 1న అయోధ్య రామాలయం ప్రధాన ద్వారానికి తలుపులు బిగిస్తున్నట్లు చెప్పారు.
బల్లార్ష నుంచి టేకు తెప్పించి తలుపులు తయారు చేస్తున్నామన్నారు.
అయోధ్య రామాలయ నిర్మాణానికి తమ వంతు సాయంగా వారణాసికి
చెందిన యాచకులు రూ. 4.5 లక్షల నగదు సాయం అందజేశారు. కాశీకి చెందిన 300 మంది
యాచకులు, ఆర్ఎస్ఎస్ సంస్థ సమర్పణ నిధి క్యాంపెయిన్ కు ఈ సాయాన్నిఅందజేసినట్లు
తెలిపారు.
శ్రీ రాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణ
పనులు తుది దశకు చేరుకోవడంతో ఆ ప్రాంతం ఆద్మాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
చెందుతోంది. భక్తులు తాకిడీ పెరిగింది. దేశ విదేశాలకు చెందిన శ్రీరామ భక్తులు
అయోధ్యకు తరలివస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అయోధ్యకు రవాణా సౌకర్యాలు
మెరుగుపరచడంతో పాటు స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చింది.
మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఇంటర్నేషనల్
ఎయిర్ పోర్టును డిసెంబరు 30న ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతో ముంబై- అయోధ్య
మధ్య నేరుగా విమానాలు నడపాలని ఇండిగో ఎయిర్ లైన్స్ నిర్ణయించింది.
ఢిల్లీ-అయోధ్య మధ్య జనవరి 6 నుంచి, అహ్మదాబాద్-అయోధ్య
మధ్య జనవరి 11 నుంచి విమాన సర్వీసులు నడుపుతామని వివరించింది.