Bhrat vs South Africa Highlights, 1st Test,
Day 1: భారత్, దక్షిణాఫ్రికా మధ్య సెంచురియన్ వేదికగా
జరుగుతున్న టెస్ట్ మ్యాచులో భారత్ తొలి ఇన్నింగ్స్
లో 8 వికెట్లు
నష్టపోయి 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ సఫారీ బౌలర్లను సహనంతో ఎదుర్కొంటున్నాడు. 105 బంతుల్లో రాహుల్ 70 పరుగులు చేశాడు.
కోహ్లీ (38),
శ్రేయస్ (31) ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డు 200 పరుగులు దాటింది.
వర్షం
కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడే సమయానికి క్రీజులో కేఎల్ రాహుల్, సిరాజ్ ఉన్నారు. వాన
ఎంతకీ ఆగకపోవడంతో తోలిరోజు ఆటను అంపైర్లు రద్దు చేశారు.
వెలుతురు
లేమి, వర్షం కారణంగా తొలి రోజు 59 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
తొలి గంటలో భారత్ ప్రదర్శన అత్యంత పేలవంగా
సాగింది. 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ ఐదు
పరుగుల వద్ద క్యాచ్ ఔట్ కాగా, యశస్వి, శుభమన్ ను ఔట్ చేయడంతో భారత్ కష్టాల్లో
పడింది.
కోహ్లీ, శ్రేయస్ ఆటతో లంచ్ సమయానికి భారత్ స్కోరు
బోర్డు 91/3గా ఉంది.
కగిసో బాడా బౌలింగ్ ధాటికి భారత్ లైనప్ కకావికలమైంది. రబాడా
17 ఓవర్లు వేసి 5 వికెట్లు తీయగా, బర్గర్ రెండు, యన్సెన్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌తో
భారత్ తరఫున ప్రసిద్ధ్ కృష్ణ, దక్షిణాఫ్రికా తరఫున బెడింగ్హమ్, నంద్రీ బర్గర్ మొదటి
సారి టెస్ట్ ఫార్మెట్కు ఆడుతున్నారు.