PM Modi’s YouTube
channel crosses 2 crore subscribers
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రజాదరణ విషయంలో మరో ఘనత సాధించారు. ఆయన యూట్యూబ్ ఛానెల్ చందాదారుల
(YouTube Channel Subscribers) సంఖ్య 2కోట్లు దాటిపోయింది. ప్రపంచంలో ఏ దేశపు నేతకూ యూట్యూబ్‌లో
ఇంతమంది చందాదారులు లేరు.
వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్లో రెండు
కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఒకే ఒక ప్రపంచ నేత నరేంద్ర మోదీ. ప్రపంచంలో
కానీ, దేశంలో కానీ మిగతా నాయకులెవరూ ఈ విషయంలో మోదీ దరిదాపుల్లోనైనా లేరు.
మోదీ తర్వాత రెండోస్థానంలో బ్రెజిల్ మాజీ
అధ్యక్షుడు జైర్ బొల్సానోరా (Jair
Bolsanora) ఉన్నారు. ఆయన యూట్యూబ్ ఛానెల్ చందాదారుల
సంఖ్య 64లక్షలు. అంటే మోదీ ఛానెల్ సబ్‌స్క్రైబర్స్‌లో మూడోవంతు కంటె తక్కువే. ఇక
మూడోస్థానంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (Volodimir Zelenskyy) ఉన్నారు. ఆయన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్స్ 11 లక్షల మంది మాత్రమే.
ఇంక యూట్యూబ్ వీక్షణలు (వ్యూస్) పరంగానూ
నరేంద్ర మోదీయే అగ్రస్థానంలో ఉన్నారు.
(YouTube Views) 2023 డిసెంబర్ నెలలో మోదీ ఛానెల్‌ను
వీక్షించినవారి సంఖ్య 22.4 కోట్లు. యూట్యూబ్ వ్యూస్ సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న
జెలెన్స్కీ ఛానల్ వీక్షకుల కంటె మోదీ ఛానెల్‌ను చూసినవారి సంఖ్య 43 రెట్లు
ఎక్కువ.
మొత్తంగా చూసుకుంటే నరేంద్రమోదీ యూట్యూబ్
ఛానెల్‌ను వీక్షించినవారి మొత్తం సంఖ్య 450 కోట్లు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో
ఏ రాజకీయ నాయకుడికీ యూట్యూబ్‌లో ఇన్ని వ్యూస్ లేనేలేవు. అలా సబ్స్క్రైబర్స్
సంఖ్యలో, వీడియో వ్యూస్ సంఖ్యలో, వీడియోల నాణ్యతలో ప్రపంచ నాయకులలోకెల్లా అగ్రస్థాయిలో
ఉన్నారు భారత ప్రధానమంత్రి.
తొమ్మిదిన్నరేళ్ళుగా అధికారంలో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా
ప్రజాదరణ కలిగిన నేతగా ఉన్నది నరేంద్ర మోదీ ఒక్కరే అని అనేక అంతర్జాతీయ సర్వేలు
స్పష్టంగా చెబుతున్నాయి. 75శాతానికి పైగా ప్రజాదరణ రేటుతో మోదీ తన సమకాలీన రాజకీయ
నాయకులు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.