First Hindu woman to
contest in Pakistan Elections
భారత పార్లమెంటు ఎన్నికలకు కొద్దిగా ముందుగా
దాయాది దేశంలోనూ ఎన్నికలు జరగబోతున్నాయి. 2024 ఫిబ్రవరిలో పాకిస్తాన్ నేషనల్
అసెంబ్లీ, ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. (Pakistan General Elections) ఈసారి ఎన్నికల్లో ఒక హిందూ మహిళ (First Hindu Womanin contest) పోటీ చేయనున్నారు. పాకిస్తాన్లో ఒక హిందూ మైనారిటీ స్త్రీ ఎన్నికల
రంగంలోకి దిగడం ఇదే మొదటిసారి.
పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ ఇటీవల ఒక
నిబంధన విధించింది. దాని ప్రకారం జనరల్ సీట్లలో ఐదు శాతం అభ్యర్ధులు తప్పనిసరిగా
మహిళలే ఉండాలి. దాంతో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రోవిన్స్ (Khyber Pakhtunkhwa province) బునేర్ జిల్లా నుంచి డాక్టర్ సవీరా పర్కాష్ (Dr Saveera Parkash) ఎన్నికలపోటీకి సిద్ధమయ్యారు. ఆ మేరకు ఆమె నామినేషన్ దాఖలు చేసారు.
ఆమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (Pakistan
People’s Party) తరఫున పోటీ చేస్తున్నారు.
సవీరా తండ్రి ఓం పర్కాష్ విశ్రాత వైద్యుడు.
ఆయన గత 35ఏళ్ళుగా పీపీపీ సభ్యుడిగా ఉన్నారు. సవీరా 2022లో ఎంబీబీఎస్ పూర్తి
చేసారు. ఇప్పుడు బునేర్లో పీపీపీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా
పనిచేస్తున్నారు. ఆమె తండ్రి ఓం పర్కాశ్ రిటైర్డ్ డాక్టర్. బిలావల్ భుట్టో
జర్దారీ నేతృత్వంలోని పీపీపీ సభ్యుడిగా గత 35 ఏళ్లుగా ఉన్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సవీరా
కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె బునేర్లో పీపీపీ మహిళా
విభాగానికి ప్రధాన కార్యదర్శి కూడా.
2024 ఫిబ్రవరి 8న జరిగే పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ పడుతున్నారు. వారిలో దాదాపు 3000 మంది మహిళలున్నారు. వారిలో ఏకైక హిందూ మహిళ సవీరానే. ముస్లిం ప్రాబల్యం ఉన్న
బునేర్ నుంచి ఆమె పోటీ చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.