AP CM launches ‘Aadudam
Andhra’ sporting event
ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా గ్రామ, వార్డు సచివాలయ
స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు క్రీడా పోటీల నిర్వహణను రాష్ట్రప్రభుత్వం
ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో
‘ఆడుదాం ఆంధ్రా 2023’ (Aadudam Andhra) పేరుతో ఈ పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రారంభించారు.
ఈ ఆటల పోటీల్లో భాగంగా రాష్ఠ్రవ్యాప్తంగా
క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్, మారథాన్, టెన్నికాయిట్, యోగాలో గ్రామ, వార్డు
సచివాలయస్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు పోటీలు నిర్వహిస్తారు. దీనికి ప్రారంభ
సూచికగా ముఖ్యమంత్రి గాల్లో బెలూన్లు ఎగరేసారు. అనంతరం క్రీడాకారులతో ప్రమాణం
చేయించారు. సీఎం జగన్ సచివాలయ స్ధాయిలో పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు క్రికెట్, బ్యాడ్మింటిన్, వాలీబాల్ బేసిక్
కిట్స్‌ను అందించారు. (State sports event)
ఈ పోటీలు 15.004 గ్రామ, వార్డు సచివాలయాల
స్థాయిలో జరుగుతాయి. 9వేల ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేసారు. 47
రోజులు, ఐదు దశల్లో పోటీల నిర్వహణ ఉంటుంది. క్రీడా సంబరాలు ఇకపై ప్రతీ ఏడాది
జరుగుతాయి. రూ.12కోట్లకుపైగా నగదు బహుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. నేటినుంచి
ఫిబ్రవరి 10 వరకూ జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’లో పాల్గొనడానికి 34.19 లక్షల మంది
క్రీడాకారులు రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ఆటగాళ్ళలోని
ఆణిముత్యాలను వెలికి తీస్తామని, ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామనీ
సీఎం జగన్ చెప్పారు.
ఈ పోటీల ద్వారా పిల్లలను ఎంపిక చేసి
వారికి శిక్షణ ఇవ్వడానికి వివిధ క్రీడలకు చెందిన నిపుణులు సహకరిస్తారని సీఎం
చెప్పారు. క్రికెట్ క్రీడాకారులకు తోడ్పడడానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు,
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చాయి. బ్యాడ్మింటన్ విషయంలో కిడాంబి
శ్రీకాంత్, పీవీ సింధు సహకరిస్తారు. వారికి కేటాయించిన స్థలాల్లో అకాడెమీలు
ప్రారంభించి వాటిద్వారా శిక్షణ ఇస్తారు. వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి
ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు వచ్చారని జగన్ వివరించారు. భవిష్యత్తులో పాఠశాల
స్థాయిలో కూడా ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు.