Santa Claus is a
commercial creation
క్రిస్మస్ చేరువ అవుతూనే శాంటాక్లాజ్ హడావుడి
మొదలైపోతుంది. శాంటా తాత వస్తాడు, కానుకలు తెస్తాడు అంటూ పిల్లలను మభ్యపెట్టే
కార్యక్రమం మొదలైపోతుంది. అసలు ఎవరీ శాంటా క్లాజ్? ఏమిటతని కథ?
క్రైస్తవ మత చరిత్రలో ఉన్న సెయింట్ నికొలాస్
అనే వ్యక్తే శాంటాక్లాజ్ అని ఆ మతస్తులు (St Nicholas) చెబుతుంటారు.
విచిత్రం ఏంటంటే సెయింట్ నికొలాస్కు కానీ, శాంటాక్లాజ్‌కు (Santa Claus) కానీ క్రిస్మస్
(Christmads)తో ఏ సంబంధమూ లేదు. ఈమధ్యనే, 19వ
శతాబ్దంలో అతన్ని బలవంతంగా, కృత్రిమంగా క్రిస్మస్లోకి చొప్పించడం జరిగింది. ఇవాళ
శాంటా లేని ప్రదేశమే లేదు. అతను ఎప్పుడూ సంతోషంగా ఉండే దయార్ద్ర హృదయుడైన
వ్యక్తిగా కనిపిస్తాడు. గులాబిరంగు చెక్కిళ్ళతో, మిలమిలలాడే కళ్ళతో, ముఖం నిండా
నవ్వులతో, పిల్లలకు కానుకలు పంపించే అద్భుతమైన వ్యక్తి కదా శాంటాక్లాజ్. నిజానికి
ఈ పాత్ర అత్యాధునికమైన సృష్టి. వ్యాపార దృక్పథంతో లాభాపేక్షతో కల్పించిన పాత్ర.
నిజమైన చారిత్రక శాంటాక్లాజ్‌కు, ఇప్పుడు మనకు తెలిసిన శాంటాక్లాజ్కూ ఏ సంబంధమూ
లేదు. నిజమైన శాంటాక్లాజ్ పొగరుబోతు, ఎప్పుడూ ఎదుటివారిని తిడుతూ బెదిరిస్తూ ఉండేవాడు,
ఏమాత్రం సహనం లేని వ్యక్తి. తన ప్రత్యర్థులపై దాడులు చేస్తుండేవాడు, క్రైస్తవేతరుల
గుడులను కూలగొట్టడంలో ముందుండేవాడు.
నిజమైన శాంటాక్లాజ్ గురించి చరిత్రలో
మనకు దొరికే మొదటి ప్రస్తావన దాదాపు సామాన్య శకం 400లో కనిపిస్తుంది. సెయింట్
నికొలాస్కు దాదాపు సమకాలికుడైన స్ట్రాటెలాటిస్ చేసిన ఆ రచనను సామాన్యశకం 440కి
చెందిన సెయింట్ ప్రోక్లస్ నిర్ధారించి, పునరుద్ఘాటించాడు. వాటి ప్రకారం
‘శాంటాక్లాజ్’ కొందరు ఖైదీలను సమర్ధిస్తూ కాన్స్టాంటైన్ చక్రవర్తిని బెదిరించాడు.
‘‘ఓ కాన్స్టాంటైన్, ఆ ఖైదీలను విడుదల చెయ్యి. లేని పక్షంలో నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు
లేవదీస్తాను. నిన్ను చంపి, నీ శవాన్ని అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను’’ అని హెచ్చరించాడు.
అలాగే స్థానిక గవర్నర్ అబ్లాబియస్ను కూడా భయపెట్టాడు. ‘‘అబ్లాబియస్, ఆ ముగ్గురినీ
వదిలిపెట్టు. లేదంటే నువ్వు రోగాల బారిన పడతావు. పురుగులు పడి పోతావు. నీ కుటుంబం
మొత్తం దిక్కుమాలిన చావు చస్తుంది.’’ ఇలా భయంకరంగా వ్యవహరించే శాంటాక్లాజ్ నిజరూప
వ్యక్తిత్వానికి ఇవాళ మనం చూసే శాంటాక్లాజ్ వ్యక్తిత్వం పూర్తి విరుద్ధంగా ఉంది.
క్రైస్తవ కథనాల ప్రకారం శాంటాక్లాజ్,
కాన్స్టాంటైన్ చక్రవర్తి నిర్వహించిన నైసియా కౌన్సిల్‌కు హాజరయ్యాడు. ఆ సమావేశం
క్రీస్తును మానవాతీత శక్తులు కలిగిన మహనీయుడైన దైవపుత్రుడిగా, క్రైస్తవాన్ని ఒక
మతంగా ప్రకటించడానికి ఓటింగ్ నిర్వహించిన సమావేశం. అందులో పాల్గొన్న శాంటా,
క్రీస్తును దైవపుత్రుడిగా ప్రకటించే ‘పిత-పుత్ర-పవిత్రాత్మ’ అనే ప్రతిపాదనను వ్యతిరేకించిన
అరుయుస్ అనే తన తోటి మతగురువుపై భౌతికదాడికి పాల్పడ్డాడు. ఆ కారణంగా అతను
స్వల్పకాలం పాటు జైలుశిక్ష కూడా అనుభవించాడు. ఆ విషయాన్ని శాంటాక్లాజ్ కథ రాసిన
ఆండ్రూ ఆఫ్ ద క్రీట్ (8వ శతాబ్దం), మైకేల్ ది ఆర్చిమాండ్రైట్ (9వ శతాబ్దం) కూడా
నిర్ధారించారు. అలా శాంటాక్లాజ్ గురించి లభ్యమవుతున్న రికార్డులన్నిటిలోనూ, అతను
అవిశ్వాసులను, క్రైస్తవేతరులను ‘శాశ్వత నరకంలో పడి కొట్టుకుంటార’ని నిందించిన
సంగతి కూడా ప్రస్తావించారు.
నిజమైన శాంటాక్లాజ్ ఇప్పుడు మనం టర్కీ
అని పిలుస్తున్న మైరా ప్రాంతానికి చెందినవాడు. మైరాలో అర్టెమిస్ అనే దేవతకు గొప్ప
ఆలయం ఉండేది. ప్రాచీన కాలంలో గొప్పవింతగా చెప్పుకునే ఎఫెసెస్లోని అర్టెమిస్ ఆలయం
అంత గొప్పగానూ ఉండేది. శాంటాక్లాజ్, క్రైస్తవానికి సంబంధించని ప్రతీ దేవతనూ
రాక్షసి(సుడు)గా చూసేవాడు. అలాంటి దేవతల ఆలయాలన్నిటిపైనా మతయుద్ధం ప్రకటించాడు. ఆ
సమయానికి కాన్స్టాంటైన్ చరిత్రలో మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి అయ్యాడు. ఆ
అవకాశాన్ని అందిపుచ్చుకున్న శాంటాక్లాజ్, అర్టెమిస్ ఆలయాన్ని తనే స్వయంగా నాశనం
చేసాడు.
అర్టెమిస్ ఆలయం ఒక్కదాన్నే కాదు,
శాంటాక్లాజ్ అని చెప్పబడుతున్న సెయింట్ నికొలాస్ కొన్ని వందల క్రైస్తవేతర ఆలయాలను
ధ్వంసం చేసాడు. అలా శాంటాక్లాజ్ అర్టెమిస్ ఆలయాన్ని పగలగొట్టిన ఘటనను
చిత్రలేఖనంగానూ మలిచారు. ప్రాచీన మందిరాలను నాశనం చేసి వాటి స్థానంలో చర్చిలు
నిర్మించినందుకు శాంటాక్లాజ్‌ను 8వ శతాబ్దానికి చెందిన ఆండ్రూ ఆఫ్ క్రేట్ గొప్ప ఆర్కిటెక్ట్‌గా
అభివర్ణించాడు. శాంటా చేపట్టిన ఆ ఆలయ విధ్వంస కార్యక్రమంలో ఆనాటి గ్రీకు ప్రజలు,
వారి పూజారులూ తీవ్రంగా దెబ్బతిన్నారు. ఆ రోజుల్లో ప్రజలు దేవతారాధన ఆధారంగా దేశాలుగా
ఏర్పడేవారు. సెయింట్ నికొలాస్ చేపట్టిన ఆలయ ధ్వంస కార్యక్రమాలు మతయుద్ధాలుగా పరిణమించాయి,
వాటిలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ వివరాలు చూస్తుంటే కొన్ని ప్రశ్నలు
తలెత్తక మానవు. పిల్లలకు ఇష్టుడైన శాంటాక్లాజ్ ఏడి, చిన్నారులకు కానుకలిచ్చే శాంటా
ఎక్కడ? అందమైన క్రిస్మస్ పండుగ ఎక్కడ? ఆ శాంటా నివాసముండే మంచుస్థావరం ఎక్కడ?
ధ్రువప్రాంతపు జింకలూ, అవి లాగే బండీ, ఆకర్షణీయమైన శాంటా టోపీ, ఇవన్నీ
ఎక్కడున్నాయి? అన్న సందేహాలు కలుగుతున్నాయి కదా.
ఇవాళ మనం చూస్తున్న శాంటాక్లాజ్ అనేది ఒక
అందమైన ఆధునికమైన రూపకల్పన. అసలు శాంటాక్లాజ్కీ, క్రిస్మస్కీ ఏ సంబంధమూ లేదు. 19వ
శతాబ్దం వరకూ శాంటాక్లాజ్‌కు తనదైన సొంత పండుగ ఉండేది. డిసెంబర్ 6ను ‘సెయింట్
నికొలాస్ డే’గా జరుపుకునేవారు. ఆ రోజు శాంటాక్లాజ్ అనబడే సెయింట్ నికొలాస్ మళ్ళీ
భూమి మీదకు దిగి వస్తాడని నమ్మేవారు. ఇప్పటికీ కొన్ని ఐరోపా దేశాలు ఆ రోజు పండుగ
జరుపుకుంటాయి.
19వ శతాబ్దపు అమెరికన్ వ్యాపార దృక్పథం
శాంటాక్లాజ్‌ను డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 25కు కృత్రిమంగా లాక్కొచ్చేసింది. ‘సెయింట్
నికొలాస్ ఈవ్’ను ‘క్రిస్మస్ ఈవ్’గా మార్చేసింది. ఆ చారిత్రక మార్పు చేసిన ఘనత ‘ది
నైట్ బిఫోర్ క్రిస్మస్’, ‘చిల్డ్రన్స్ ఫ్రెండ్’ అనే 19వ శతాబ్దానికి చెందిన రెండు
కవితలకు దక్కుతుంది. ఈ మొత్తం విషయం సారాంశం ఏంటంటే 19వ శతాబ్దం వరకూ శాంటాక్లాజ్కూ,
క్రిస్మస్కూ ఏ సంబంధమూ లేదు. అతని పండుగ డిసెంబర్ 6న జరిగేది. అందులో ధ్రువపు
జింకలూ లేవు, అతనికి బిషప్ ధరించే దుస్తులూ లేవు. అతను అందమైన, ఆకర్షణీయమైన,
ప్రేమాస్పదమైన శాంటా తాత కానే కాదు. అతను ఈ భూమి మీదకు అవిశ్వాసులను శిక్షించడానికి వచ్చినవాడు మాత్రమే.
మరి శాంటాక్లాజ్కి ఈ గొప్ప ముద్ర
కల్పించింది ఎవరు? ఆ ఘనత తమదేనని కోకా కోలా కంపెనీ ప్రకటించుకుంది. 1931నాటి కోకాకోలా
వాణిజ్య ప్రకటనలో శాంటాక్లాజ్ ప్రస్తుత రూపాన్ని ఆ కంపెనీ తీర్చిదిద్దింది. ఆ
విషయాన్ని ఆ కంపెనీ స్వయంగా తమ అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది కూడా. శాంటాక్లాజ్‌కు
ఆదరణ కల్పించేందుకు 19వ శతాబ్దంలోనే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కోకాకోలా ప్రకటనకు
ముందే, సామాన్య శకం 1850లోనే శాంటాక్లాజ్‌కు ఆధునిక అవతారం కల్పించడం మొదలైంది.
ఆనాటి చిత్రలేఖనంలో, శాంటాక్లాజ్ చిన్నపిల్లలకు నల్లటి సిరా పూస్తూ కనిపిస్తాడు.
అక్కడినుంచీ శాంటాక్లాజ్‌ను లోకప్రియుణ్ణి చేసే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కానీ
1931లో కోకాకోలా వాణిజ్య ప్రకటనలో శాంటాకు ప్రస్తుతం ఉన్న రూపం కల్పించారు.
ఎరుపు-తెలుపు రంగుల్లోని ఆకర్షణీయమైన దుస్తుల్లో ఆనందం పంచుతుండే ఓ పెద్దాయనలా ఆ
ప్రకటన శాంటాక్లాజ్‌ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. అలా, ఇవాళ మనం చూస్తున్న
శాంటాక్లాజ్‌కు ప్రజాదరణ కల్పించినది కోకాకోలా కంపెనీ.
నిజానికి కోకాకోలా ప్రకటన కంటె ముందే
ఎరుపు, నారింజ వన్నె దుస్తుల్లో శాంటాక్లాజ్‌ను చూపించారు, కానీ అవి చాలా తక్కువ.
అతని చిత్రాలు సాధారణంగా బిషప్‌లు ధరించే తెల్లని దుస్తుల్లోనే ఉండేవి. అయితే కోకాకోలా
తమ రంగుకు విస్తృత ప్రచారం కల్పించేందుకు, శీతాకాలంలో తమ అమ్మకాలు పెంచుకునేందుకు శాంటాకు
ఆ దుస్తులు తొడిగింది. అలా, ప్రజలను భయపెట్టి బెదిరించి హెచ్చరించి మతం మారకపోతే
చంపేసిన సెయింట్ నికొలాస్, సరదాగా ఉంటూ ఎర్రని దుస్తుల్లో పిల్లలకు ఆహ్లాదం కలిగిస్తూ
వారికి కానుకలు పంచిపెట్టే ఉదారుడైన శాంటాక్లాజ్‌గా మారిపోయాడు.
అందుకే శాంటాక్లాజ్కూ, క్రిస్మస్కూ,
జీసస్‌కూ ఏ సంబంధమూ లేకపోయినా, అతని నిజరూపానికి విరుద్ధమైన రూపాన్ని తయారుచేసి
చెలామణీ చేసేసారు. కోకాకోలా చేసిన ఆ పని వల్ల ఈనాటితరం ముందు దొంగ వేషంలోని సెయింట్
నికొలాస్, పిల్లా పెద్దా తేడా లేకుండా అందరినీ బుట్టలో పడేసాడు.