తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవకపోవడంతో, ఈ నెల 31 నుంచి సమ్మెను మరింత ఉదృతం చేయనున్నట్లు ప్రకటించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, అంగన్వాడీల నాయకులు కోరుతున్నారు.
నెలకు రూ.26 వేల కనీస వేతనం, గ్రాట్యుటీతోపాటు పింఛను సదుపాయం కల్పించాలని 14 రోజులుగా అన్ని జిల్లాల్లో అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 55 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అందులో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు లక్ష మందికిపైగా పనిచేస్తున్నారు.వీరంతా ప్రస్తుతం సమ్మె చేస్తున్నారు.