కోవిడ్ కొత్త వేరియంట్ (covid news) వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశంలో 628 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4054కు చేరింది. కరోనా కారణంగా గడచిన నాలుగేళ్లలో మరణించిన వారి సంఖ్య 5,33,334కు పెరిగింది. తాజాగా కేరళలో కరోనాతో ఓ వ్యక్తి చనిపోయారు.
2019 నుంచి దేశంలో 4,50,09,248 మంది కోవిడ్ భారిన పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో 4.44 కోట్ల మంది కోలుకున్నారు. అంటే 98.81 శాతం మంది రికవరీ అయ్యారు. కోవిడ్ సోకిన వారిలో మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 220.67 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందించారు.