తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై కేసు (enforcement directorate) నమోదైంది. విధులకు అడ్డుపడ్డారంటూ తమిళనాడు విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.
మధురైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిగా చేస్తోన్న అంకిత్ తివారీని లంచం డిమాండ్ చేసిన కేసులో తమిళనాడు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా తమిళనాడు డీవీఏసీ అధికారులు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దర్యాపు సమయంలో తమ విధులకు అడ్డు తగిలారంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈడీ అధికారులపై కేసు నమోదు చేశారు.
మధురైలో ఈడీ అధికారిగా ఉన్న అంకిత్ అక్రమాస్తుల కేసులో ఓ ప్రభుత్వ అధికారిని రూ.3 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఆ తరవాత మరికొంత తగ్గించి కనీసం రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు ఆ ఉద్యోగి రూ.20 లక్షలకు బేరం మాట్లాడుకున్నాడు. లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.