దారం మెడకు చుట్టుకుంటే చనిపోతారా? అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. దారం మెడకు చుట్టుకుని మరణించిన ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ జాతీయ రహదారిపై వకోలా వంతెన వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమీర్ సురేష్ జాదవ్ అనే కానిస్టేబుల్ డిండోషి స్టేషన్లో విధులు ముగింపుకుని వర్లి వైపు వెళుతుండగా ఈ ప్రమాదం (crime news) జరిగింది.
బైకుపై వేగంగా వెళుతోన్న కానిస్టేబుల్ సమీర్ మెడకు దారం చుట్టుకుని తెగిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలోని జనం కానిస్టేబుల్ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఆస్పత్రికి చేరుకునే సమయానికే ఆయన చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు. ఖేర్వాడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.