ఢిల్లీలో పొగమంచు కమ్మేసింది. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీలకు పడిపోయాయి. దీనికితోడు పొగమంచు కమ్మేయడంతో ప్రయాణాలు కష్టంగా మారాయి. నాలుగు మీటర్ల దూరంలోని వస్తువులు కూడా కనిపించడం లేదు. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో (delhi airport) విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.కొన్ని పౌర విమానసేవలు నిలిచిపోయాయి.
ఢిల్లీ సమీపంలోని విమానాశ్రయాల్లో కూడా పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ ఉష్టోగ్రతలు జీరో డిగ్రీలకు పడిపోయాయి. అమృత్సర్, ప్రయాగ్రాజ్, జైసల్మేర్, ఆగ్రా, గ్వాలియర్ విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాలు దారి మళ్లించారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్నింటిని రద్దు చేశారు. పొగమంచుతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత క్షీణించింది. ఏక్యూఐ 400పైగా నమోదైంది.