రెండే వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఒక కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. నల్గొండ జిల్లాలో గత రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (road accident) ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. నిమ్మానాయక్ గ్రామానికి చెందిన కేశవులు అనే యువకుడు ఆదివారం రాత్రి బైక్పై ప్రయాణిస్తూ మిర్యాలగూడ సమీపంలోని పెద్దవూర వద్ద పాదచారిని ఢీ కొన్నాడు. ఆ ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. సమాచారం అందడంతో కేశవులు కుటుంబ సభ్యులు ఆటోలో ఘటనా ప్రాంతానికి బయలుదేశారు.
ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో వీరి ఆటో, ఆయిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వారిలో రమావత్ గన్యా, నాగరాజు, పాండ్య, బుజ్జి ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకుని పోలీసులు గాయపడ్డవారిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.