మానవ అక్రమ రవాణా అనుమానంతో మూడు రోజుల కిందట ఫ్రాన్స్ 300 మంది భారత ప్రయాణీకులను ( ground plane with 300 indians free ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వారిని విమానాశ్రయంలోనే ప్రత్యేక న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి విచారించారు. ఇవాళ ఉదయం విమాన ప్రయాణీకులను వదిలేశారు. అయితే నికరాగువా వెళుతుందా, తిరిగి భారత్ వస్తుందా అనే విషయం వెల్లడి కావాల్సి ఉంది.
ఢిల్లీ నుంచి లెజెండ్ విమానంలో 300 మంది భారత ప్రయాణీకులు గురువారం నికరాగువా బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో ఫ్రాన్స్‌లో ఇంధనం నింపుకునేందుకు విమానాన్ని దించారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఫ్రాన్స్ అధికారులకు ఇచ్చిన సమాచారం మేరకు అక్రమ మానవ రవాణాగా అనుమానించి, భారత ప్రయాణీకులను అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల కన్నా ఎక్కువ సమయం కస్టడీలో ఉంచుకునే అవకాశం లేకపోవడంతో వారిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి భారత ప్రయాణీకులకు ఊరట కలిగించారు.మొత్తం ప్రయాణీకుల్లో 11 మందిని ఏ తోడు లేని మైనర్లగా గుర్తించారు. 10 మంది ఫ్రాన్సులో ఆశ్రయం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు.