ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులు పెద్ద మనసు చాటుకున్నారు. 1998లో బాంబే ఐఐటీలో (bombay IIT) చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సిల్వర్ జూబ్లీ రీ యూనియన్ సందర్భంగా రూ.57 కోట్లు విరాళం ప్రకటించారు. ఒకే బ్యాచ్ ఇంత పెద్ద మొత్తం విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1971 బ్యాచ్ విద్యార్థులు గతంలో రూ.41 కోట్లు విరాళం అందించారు.
పీక్ ఎక్స్‌వీ ఎండీ శైలేంద్ర సింగ్, వెక్టార్ క్యాపిటల్ ఎండీ అనుపమ్, సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ సక్సేనా, గూగుల్ డీప్‌మైండ్ దిలీప్ జార్జ్లతోపాటు 200 మంది పూర్వ విద్యార్థులు భారీ విరాళాలు ప్రకటించారు. ప్రపంచంలోనే టాప్ 50 యూనివర్సిటీల్లో బాంబే ఐఐటీని నిలపాలని పూర్వ విద్యార్థులు సాయం అందించారు. నందన్ నిలేకని గతంలో బాంబే ఐఐటీకి రూ.315, రూ.85 కోట్లు చొప్పున అందించి పెద్ద మనసు చాటుకున్నారు.