Virat Kohli rejoins Team:
సెంచూరియన్
వేదికగా డిసెంబర్ 26న జరగనున్న టెస్ట్ మ్యాచ్(BHARAT VS SOUTH AFRICA) కోసం విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా చేరుకున్నట్లు
బీసీసీఐ తెలిపింది. ముందస్తు షెడ్యూల్ మేరకే విరాట్ కోహ్లీ లండన్ వెళ్ళాడని, జట్టు
మేనేజ్మెంట్ తో ముందుగా సంప్రదించిన తర్వాతే ప్రయాణించాడని స్పష్టం చేశారు.
సన్నాహక
మ్యాచులో కోహ్లీ పాల్గొనడం లేదని తెలిపారు. ఈ నిర్ణయం అకస్మాత్తుగా అప్పటికప్పుడు
తీసుకోలేదని ముందస్తు సమాచారం మేరకే జరిగిందన్నారు. కుటుంబ పరమైన అత్యవసర
పరిస్థితి కారణంగానే ప్రయాణం చేయాల్సి వచ్చిందన్నారు. కోహ్లీ చాలా ప్రణాళికబద్దంగా
ఉంటాడని, అతడిని ప్రశ్నించడానికి ఏమీ ఉండదని, బీసీసీఐకి అందజేసిన ప్రణాళికలో
భాగంగానే లండన్ పర్యటనకు వెళ్లి వచ్చాడని వెల్లడించారు.
జట్టు
సభ్యులతో కలిసి అనేక రకాల శిక్షణల్లో పాల్గొన్న కోహ్లీ, సెంచూరియన్ కు తిరిగి
వచ్చిన తర్వాత కూడా కొనసాగించాడని
పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా
పేసర్లు కగిసో రబాడ, లుంగి ఎంగడీలు నెట్ లో గాయపడినప్పటికీ బాక్సింగ్ డే టెస్టులో
తామే గెలుస్తామని సఫారీ జట్టు కోట్ షుక్రీ కొన్నాడ్ చెప్పారు.