first-ever Test win against Australia
భారత
మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టీమ్ పై తొలిసారి టెస్ట్ మ్యాచ్ గెలిచి రికార్డు
సృష్టించింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు సమష్టి ప్రదర్శనతో
రికార్డు విజయాన్ని అందుకుంది.
మహిళల క్రికెట్ లో భాగంగా ఇప్పటి వరకు
ఆస్ట్రేలియాతో 11 టెస్టులు ఆడగా ఇదే తొలి గెలుపు.
డిసెంబర్
21న ప్రారంభమైన మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో 219 పరుగులకే ఇన్నింగ్స్
ముగిసింది.
పూజా
వస్త్రాకర్ నాలుగు వికెట్లు తీయగా, స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టారు. దీప్తి
శర్మ రెండ వికెట్లు తన ఖాతాలో వేసుకోవడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్
కుప్పకూలింది.
భారత్
ఓపెనర్లు షఫాలీ వర్మ 40 పరుగులు చేయగా, స్మృతి మంధాన 74 పరుగులు చేసి మంచి ఆరంభ
భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిడిలార్డర్ లో రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73
పరుగులు చేయగా, లోయర్ ఆర్డర్ లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో
ఆకట్టుకున్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 406 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యంలో
నిలిచింది.
ఓవర్ నైట్ స్కోరు 233/5తో రెండో ఇన్నింగ్స్
ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 261 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని భారత
సునాయాశంగా ఛేదించింది. 75 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు నష్టపోయి
చేరుకుంది. స్మృతీ మంధాన (38*),
జెమీమా రోడ్రిగ్స్(12*) జట్టును విజయం వైపు
నడిపించారు.