మానవ అక్రమ రవాణా అనుమానంతో 300 మంది భారత ప్రయాణీకులను అదుపులోకి తీసుకున్న ఫ్రాన్స్ ప్రభుత్వం వారిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టింది. విమానాశ్రయంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రయాణీకులను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.
నిబంధనల ప్రకారం విదేశీయులను ఫ్రాన్స్ ప్రభుత్వం (Bharat France Row) 4 నుంచి 8 రోజులు మాత్రమే నిర్భంధంలో ఉంచుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం 26 రోజులు కస్టడీ చేయవచ్చు. ప్రయాణీకులను గమ్యస్థానాలకు పంపాలా, తిరిగి వెనక్కు పంపించి వేయాలా అనే విషయంలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి తీర్పుపై భారత ప్రయాణీకుల భవిష్యత్తు ఆధారపడిఉంది. వీరిలో ఇప్పటికే కొందరు శరణార్దులుగా ఆశ్రయం పొందేందుకు దరఖాస్తు పెట్లుకున్నట్లు తెలుస్తోంది.