కోవిడ్
-19 కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్
ఉపరకం జేఎన్1(jn.1) వ్యాప్తి పై సార్స్ కోవిడ్-2
జినోమిక్స్ కన్సార్టియం -భారత్(INSACOG)
చీఫ్ డాక్టర్ ఎన్.కే ఆరోరా స్పందించారు. ఉపరకం జేఎన్.1కు అడ్డుకట్ట వేసేందుకు
వ్యాక్సిన్ అదనపు డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం
దేశంలో వైరస్ వ్యాప్తి గురించి భయపడాల్సిన అవసరం లేదన్న డాక్టర్ అరోరా, 60 ఏళ్ళు
వయస్సు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తగిన రక్షణ చర్యలు
పాటించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి విషయంలో జాగురూకతతో వ్యవహరిస్తే సరిపోతుందని
వ్యాక్సిన్ అదనపు డోస్ అవసరం లేదని తేల్చిచెప్పారు.
వివిద
రకాల ఒమిక్రాన్ ఉపరకాలు వృద్ధి చెందినప్పటికీ
అంత ప్రమాదకరంగా రూపాంతరం చెందలేదన్నారు.
ప్రతీ వారం దేశంలోని వివిధ
ప్రాంతాల్లో కొత్త ఉపరకాల్లో వైరస్ నిర్ధారణ అవుతుందని దాని గురించి ఆందోళన అనవసరం
అన్నారు. మిగతా వేరియంట్ల లాగే జేఎన్.1 ఉపరకం వ్యాధి లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రిలో
చేరాల్సినంత ప్రమాదకరం కాదన్నారు.
సాధారణ జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, కొన్ని
కేసుల్లో డయేరియా లక్షణాలు ఉంటున్నాయని ఒకటి రెండు రోజుల్లో కోలుకోవచ్చు అని చెప్పారు
కేసుల
సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉందన్న
విషయాన్ని గుర్తించాలని కోరారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 752 కేసులు నమోదు
కాగా నలుగురు మరణించారు. ఈ ఏడాది మే 21 తర్వాత కేసులు పెరగడం ఇదే తొలిసారి,
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,420గా ఉంది.