శ్రీ
అయ్యప్ప స్వామి వారి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద
సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో
శబరిమల ప్రాంతమంతా అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. స్వామి శరణుఘోషతో ప్రాంతమంతా
మార్మోగుతోంది.
ఎరుమేలికి
నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తెల్లవారుజామున నాలుగు
గంటల నుంచే భక్తులు ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు. స్వామి దర్శనానికి
గంటల కొద్ది సమయంపడుతోందని భక్తులు చెబుతున్నారు.
భక్తుల
రద్దీ పెరగడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. అటవీమార్గంలో పాదయాత్ర సమయంపై
ఆంక్షలను సరళీకరించింది.
అఝతక్కడవు మార్గంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు
నడకమార్గంలో ప్రయాణించేందుకు అనుమతించారు. అలాగే ముక్కుఝి మార్గంలో ప్రయాణంపై
గతంలో ఉన్న ఆంక్షలు ఎత్తివేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు
భక్తులను అనుమతించారు. ఈ మేరకు ఇడుక్కి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో
మధ్యాహ్నం 2.30గంటల వరకే భక్తులకు అనుమతి ఉండేది.