missile strike hits ‘MV
Chem Pluto’
జపాన్
కు చెందిన కెమికల్ ట్యాంకర్ షిప్ అరేబియా సముద్రం గుండా భారత్ వస్తుండగా ఇరాన్ అండతో
హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ
పెంటగాన్ వెల్లడించింది. ఇటీవల కాలంలో అరేబియా, హిందూ మహాసముద్రాల్లో అనేక నౌకలపై
హౌతీలు దాడి చేసి హైజాక్ కు యత్నిస్తున్నారు.
ఇజ్రాయెల్
–హమాస్ మధ్య అక్టోబర్ 7న యుద్ధం మొదలైనప్పటి నుంచి సుముద్ర దాడుల ఘటనలు ఎక్కువగా
నమోదవుతున్నాయి. ఇరాన్ ప్రోద్భలంతో హౌతీ తిరుగుబాటు దారులు ఆ ఘాతుకానికి
పాల్పడుతున్నారు.
శనివారం
జరిగిన దాడిలో ప్రాణనష్టం జరగలేదని, మంటలు చెలరేగి కొంతమేర ఆస్తినష్టం జరిగినట్లు
అమెరికా తెలిపింది. భారత్ వైపు వెళ్ళే నౌకతో అమెరికా ఆర్మీ సంబంధాలు
కొనసాగిస్తోందని, భారత కోస్తా తీరానికి 200 నాటికల్ మైళ్ళ దూరంలో దాడి జరిగినట్లు
వివరించింది.
సంఘటనా స్థలానికి దగ్గరలో
యూఎస్ కు చెందిన నౌకా దళాలు లేవని, దీంతో ఇతర దేశాల సహాయం కోరినట్లు పేర్కొంది.
ఇజ్రాయెల్-హమాస్
యుద్ధం తర్వాత, ఇరాన్ అండతో జరుగుతున్న సముద్రదాడులు గురించి అమెరికా స్పందించడం
ఇదే మొదటిసారి.
జపాన్
కు చెందిన ఎంవీ కెమ్ ప్లూటో షిప్ ను డచ్ సంస్థ లీజుకు తీసుకుని నడుపుతోందని
అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. అయితే ఈ డచ్
సంస్థకు ఇజ్రాయెల్ షిప్పింగ్ టైకూన్ ఇడాన్ ఓఫర్ కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కెమికల్
ఉత్పత్తులతో సౌదీ ఆరేబియా పోర్టు నుంచి భారత్ వెళుతుండగా దాడి జరిగింది. రక్షణ
కోరుతూ తమకు సమాచారం అందడంతో సహాయచర్యలు ప్రారంభించినట్లు భారత ఆర్మీ
ప్రకటించింది. డ్రోన్ దాడికి గురైన కెమ్ ప్లూటోకు భారత కోస్టుగోగార్డులు అన్ని
రకాలుగా సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
సముద్ర గస్తీ విమానం డోర్నియర్ తో పాటు, కోస్ట్
గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ కూడా ఎంవీ కెమ్ ప్లూటో దిశగా కదలాయి.
హౌతీ
రెబల్స్, దాదాపు 100కు పైగా డ్రోన్లు, మిస్సైళ్ళతో దాదాపు పది వాణిజ్య నౌకలపై
దాడులకు పాల్పడ్డారని అమెరికా రక్షణమంత్రిత్వ శాఖ పేర్కొంది.