దేశంలో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కాన్నూర్ ఐఐటీ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు. విద్యార్ధుల కార్యక్రమాల కమిటీ డీన్‌గా వ్యవహరిస్తోన్న ఖండేకర్, మెకానికల్ విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పూర్వ విద్యార్ధులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. నిలుచున్న చోటే గుండెనొప్పతో కుప్పకూలిన ఖండేకర్, అక్కడే కన్నుమూశారు.
గుండెపోటుతో కుప్పకూలిన సమీర్‌ను విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఖండేకర్ మృతిపట్ల తోటి ప్రొఫెసర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతదేహాన్ని ఐఐటీ కాన్పూర్‌లోని ఆసుపత్రిలో ఉంచారు. కేంబ్రిడ్జ్‌లో విద్యనభ్యసిస్తోన్న ఖండేకర్ కుమారుడు ప్రవాహ్ ఖండేకర్ వచ్చిన తరవాత అంతక్రియలు నిర్వహించనున్నారు. ఐదేళ్లుగా ఖండేకర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.