భారతీయ రైల్వే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును త్వరలో పట్టాలెక్కించనుంది.తక్కువ టికెట్ ధరతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా, వందేభారత్ తరహాలో అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 30న ప్రధాని మోదీ అయోధ్యలోని విమానాశ్రయాన్ని, ఆరు వందేభారత్ రైళ్లతోపాటు, 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. ముందుగా ఢిల్లీ దర్బంగా మార్గంలో ఒకటి, మాల్దా బెంగళూరు మధ్య మరొకటి అందుబాటులోకి రానున్నాయి.
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో మొత్తం నాన్ ఏసీ బోగీలుంటాయి. ఇది పుష్ పుల్ తరహా రైలు. ముందు, వెనుక భాగంలో ఇంజన్లు ఉంటాయి. దీని వల్ల తక్కువ సమయంలోనే వేగం అందుకుంటుంది. ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ రైళ్లో 22 బోగీలుంటాయి. అందులో 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్, 8 జనరల్ బోగీలుంటాయి. 2 బోగీలను మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయించారు. దీని గరిష్ఠ వేగం గంటకు 130 కి.మీ. టికెట్ ధరలు ఇంకా వెల్లడికాలేదు.